యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని ఇటీవల తిరుమలలో ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.అతడి కెరీర్‌లోనే సూపర్ హిట్ అయిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.
సుకుమార్ రైటింగ్స్ నుండి వస్తున్న ఓ సినిమాలో నిఖిల్ హీరోగా ఎంపికయ్యాడు.ఈ సినిమాను GA2 బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, ఈ చిత్రానికి ‘18 పేజీస్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
ఈ టైటిల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ చేసింది.ఈ సినిమాలో నిఖిల్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయాలతో పాటు ఇతర వివరాలను చిత్ర యూనిట్ త్వరలో తెలపనుంది.అటు కార్తీకేయ సీక్వెల్‌తో పాటు ఈ సినిమాను కూడా అనౌన్స్ చేయడంతో నిఖిల్ ఫుల్ బిజీగా మారనున్నాడు.