నోరు జారి 152 టైటిల్‌ను ప్రకటించిన చిరు

మెగాస్టార్‌ చిరంజీవి నిన్న ఓ పిట్టకథ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నాడు.అక్కడ చిరంజీవి మాట్లాడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.

 Mega Star Chiranjeevi Announce The Koratala Siva Movie Tittle-TeluguStop.com

అదే సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.మాటల మద్యలో చిరంజీవి తన దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడుతూ తన 152వ చిత్రం టైటిల్‌ను ప్రకటించాడు.

అక్కడున్న వారు అంతా కూడా గట్టిగా మొత్తుకోవడంతో చిరుకు అర్థం కాలేదు.తన సినిమా టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదా అంటూ అవాక్కయ్యాడు.

Telugu Acharya, Chiranjeevi, Teamunit-Movie

‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను చిరంజీవి ప్రకటించిన నేపథ్యంలో సినిమాపై ఇన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.చాలా రోజులుగా ఆచార్య అంటూ ప్రచారం అయితే జరుగుతుంది.కాని అఫిషియల్‌గా మాత్రం ఆచార్యను రివీల్‌ చేయలేదు.అందుకోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి అవేవి లేకుండా సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో యూనిట్‌ సభ్యులు ఒకింత అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Teamunit-Movie

చిరంజీవి టైటిల్‌ను రివీల్‌ చేసిన తర్వాత పొరపాటున రివీల్‌ చేశాను అంటూ దర్శకుడు కొరటాల శివకు సారీ కూడా చెప్పాడు.మొత్తానికి మెగా 152కి సంబంధించిన కీలక అప్‌డేట్‌ రావడంతో సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు.ఉగాది కానుకగా ఆచార్య ఫస్ట్‌లుక్‌ మరియు విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube