సాధారణంగా వృద్ధాప్యంలో చాలామంది అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉంటారు.కానీ కొంత మంది వృద్ధాప్యంలోనూ ఆశ్చర్యానికి గురిచేసే పనులు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు.
తాజాగా కేరళకు చెందిన ఓ భామ్మ కూడా ఇలాంటి పనే చేసి వార్తల్లో నిలిచింది.ఇంతకీ ఆమె ఏం చేసిందని మీరు అనుకుంటున్నారా.? ఆమె ఏకంగా 105 ఏళ్ల వయసులో 4వ తరగతి పరీక్షలు రాసి పాసైంది.
105 ఏళ్ల వయసులో 4వ తరగతి ఏమిటి అనుకుంటున్నారా? కేరళకుచదువుకు వయసుతో పనిలేదని చాలామంది నిరూపించారు.అయితే కేరళకు చెందిన భగీరథి అనే 105 ఏళ్ల భామ రాష్ట్ర సాక్షరతా మిషన్ నిర్వహించిన 4వ తరగతి పరీక్షలు రాసింది.తాను చిన్నతనంలో 3వ తరగతి వరకు చదివి, తల్లిని కోల్పోవడంతో మధ్యలోనే చదువు ఆపేసింది.
దీంతో ఇప్పుడు 105 ఏళ్ల వయసులో ఆమె 4వ తరగతి పాసైంది.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు, స్థానికులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.భగీరథి ఏకంగా 74.5 శాతం మార్కులతో పాస్ కావడంతో ఆమె 10వ తరగతి పరీక్షలు కూడా రాసి పాసవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.మొత్తానికి 105 ఏళ్ల భామ సాధించిన ఈ ఘనతతో ఈ వార్త వైరల్‌గా మారింది.