పౌరసత్వ సవరణ చట్టం బిల్లు చేసిన బీజేపీ ప్రభుత్వం దానిని ఎలా అయిన అమల్లోకి తీసుకురావాలని క్రుతనిచ్చయంతో ఉంది.ఎవరు ఎన్ని అడ్డు పుల్లలు వేసిన సిఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీ విషయం మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే కేంద్రంలోని పెద్దలు స్పష్టం చేసేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వ విధానాల మీదా చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితిలో సిఏఏని అమలు చేయడానికి వీలు లేదని ప్రజా మద్దతు కూడదగుతుంది.
ఇదిలా ఉంటే దేశంలో కాంగ్రెస్ తో పాటు, కాశ్మీర్ లో కొన్ని వేర్పాటు వాద సంస్థలు, అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ తీసుకొస్తున్న సంస్కరణలపై యురోపియన్ యూనియన్ ని ఫిర్యాదు చేసి ఈ విషయంపై స్పందించాలని కోరారు.
దీనిపై భారత్ ప్రభుత్వమై ఒత్తిడి తీసుకురావాలని మొదటిగా యూరోపియన్ యూనియన్ దేశాలు భావించిన తరువాత మాత్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.
భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది.తమ దేశంలో శాంతి భద్రతల కోసం తీసుకున్న నిర్ణయంపై మీరు ఎలా కలుగజేసుకొని ఓటింగ్ పెట్టాలని అనుకుంటారు అని ప్రశ్నించింది.
ఇందులో అంతర్జాతీయ జోక్యానికి ఆస్కారం లేదని పేర్కొంది.భారత దౌత్య విభాగం గట్టిగా హెచ్చరించడంతో సీఏఏ విషయాన్ని పక్కన పెట్టాలని ఐరోపా దేశాల సమాఖ్య భావించింది.