స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ తన కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 రోజులు పూర్తి చేసుకుంది.ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.118.88 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది.ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమా అక్కడ 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది.
బన్నీ కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.
సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ఉన్నా ఆ సినిమాను డామినేట్ చేసి మరీ వసూళ్లు కొల్లగొడుతోంది ఈ మూవీ.ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం 9 రోజుల షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 30.89 కోట్లు
సీడెడ్ – 15.69 కోట్లు
నెల్లూరు – 3.44 కోట్లు
కృష్ణా – 7.61 కోట్లు
గుంటూరు – 8.29 కోట్లు
వైజాగ్ – 15.21 కోట్లు
ఈస్ట్ – 7.98 కోట్లు
వెస్ట్ – 6.38 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.95.49 కోట్లు
కర్ణాటక – 8.15 కోట్లు
కేరళ – 1.00 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3.34 కోట్లు
యూఎస్ఏ – 10.90 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.118.88 కోట్లు
.