నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎంత మంచివాడవురా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.సంక్రాంతి బరిలో అప్పటికే రెండు పెద్ద సినిమాలు ఉన్నా, ఎలాంటి వెనకడుగు వేయకుండా ఫ్యామిలీ సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ సినిమాను రిలీజ్ చేశాడు కళ్యాణ్ రామ్.
అయితే ఫ్యామిలీ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తప్పక లభిస్తుందనే వారి అంచనా బెడిసికొట్టింది.
శతమానం భవతి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సతీష్ వేగ్నేశ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో అదే సీన్ రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ సినిమా రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది.ఫ్యామిలీ సినిమాలను రిలీజ్ చేయాల్సిన సమయం ఇది కాదంటూ వారు సందేశమిచ్చారు.ఇక ఈ సినిమాకు కలెక్షన్లు తొలి రోజు పండగ సెలవు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కలెక్షన్లు సెలవులు ముగియడంతో దారుణంగా పడిపోయాయి.6 రోజులు ముగిసే సరికి ఈ సినిమా కేవలం రూ.6.05 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అంశం ఉన్నప్పటికీ రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఫెయిల్యూర్ మూవీగా మిగలడం ఖాయమని అంటున్నారు సినీ క్రిటిక్స్.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 1.39 కోట్లు
సీడెడ్ – 0.79 కోట్లు
నెల్లూరు – 0.23 కోట్లు
కృష్ణా – 0.67 కోట్లు
గుంటూరు – 0.65 కోట్లు
వైజాగ్ – 0.78 కోట్లు
ఈస్ట్ – 0.91 కోట్లు
వెస్ట్ – 0.63 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.6.05 కోట్లు