ఎంత మంచివాడవురా 6 రోజుల కలెక్షన్లు.. మరో బ్రహ్మోత్సవం!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎంత మంచివాడవురా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

సంక్రాంతి బరిలో అప్పటికే రెండు పెద్ద సినిమాలు ఉన్నా, ఎలాంటి వెనకడుగు వేయకుండా ఫ్యామిలీ సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ సినిమాను రిలీజ్ చేశాడు కళ్యాణ్ రామ్.

అయితే ఫ్యామిలీ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తప్పక లభిస్తుందనే వారి అంచనా బెడిసికొట్టింది.

శతమానం భవతి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సతీష్ వేగ్నేశ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో అదే సీన్ రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు.

కానీ సినిమా రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది.ఫ్యామిలీ సినిమాలను రిలీజ్ చేయాల్సిన సమయం ఇది కాదంటూ వారు సందేశమిచ్చారు.

ఇక ఈ సినిమాకు కలెక్షన్లు తొలి రోజు పండగ సెలవు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.

4 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ కలెక్షన్లు సెలవులు ముగియడంతో దారుణంగా పడిపోయాయి.

6 రోజులు ముగిసే సరికి ఈ సినిమా కేవలం రూ.6.

05 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అంశం ఉన్నప్పటికీ రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఫెయిల్యూర్‌ మూవీగా మిగలడం ఖాయమని అంటున్నారు సినీ క్రిటిక్స్.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 1.39 కోట్లు సీడెడ్ - 0.

79 కోట్లు నెల్లూరు - 0.23 కోట్లు కృష్ణా - 0.

67 కోట్లు గుంటూరు - 0.65 కోట్లు వైజాగ్ - 0.

78 కోట్లు ఈస్ట్ - 0.91 కోట్లు వెస్ట్ - 0.

63 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - రూ.6.

05 కోట్లు.

బాబు పుట్టిన రెండు నెలలకే అలాంటి పెయిన్.. కాజల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!