ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడు రాజధానుల వ్యవహారం కీలకంగా మారిన సంగతి అందరికీ తెలుసిందే.ఉంది అధికార పార్టీ చివరగా మూడు రాజధానులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది.
విశాఖను పరిపాలన రాజధానిగా నిర్ణయించేశారు.తనకున్న బలంతో దీనిపై జరిగిన ఓటింగ్ లో కూడా మెజారిటీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉంటే అసెంబ్లీలో జనసేన వాయిస్ వినిపించే ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక గత కొంత కాలంగా అధికార పార్టీకి మద్దతుగా స్వరం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా అసెంబ్లీలో జనసేన తరుపున మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాల్సిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్ కి లేఖ రాసి మరీ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇప్పటికే పార్టీ స్టాండ్ నుంచి బయటకి వచ్చిన రాపాక ఈ రోజు జరిగిన సభలో యధావిధిగా తన పాత తరహాలోనే అధికార పార్టీకి మద్దతుగా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపాడు.జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కాబట్టి మూడు రాజధానుల అంశాన్ని జనసేన పార్టీ తరుపున బలపరుస్తున్నట్లు తెలిపారు.
దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసెంబ్లీ సాక్షిగా ధిక్కార స్వరాన్ని ఎమ్మెల్యే రాపాక వినిపించారని తేలిపోయింది.ఇన్ని రోజులు పార్టీ స్టాండ్ కి విరుద్ధంగా వెళ్లి తన వ్యక్తిగత అభిప్రాయం అని సమర్ధించుకున్న రాపాకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇప్పటికే జనసేన కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తూ ఉండటంతో ఆ నిర్ణయం ఈ రోజు జరిగే పార్టీ అత్యవసర సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.