తాజాగా ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం అల వైకుంఠ పురములో.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా అల్లు అర్జున్ కి జోడిగా పూజా హెగ్డే నివేదా పేతురాజ్ నటించారు.అలాగే ఈ చిత్రంలో సునీల్, సుశాంత్, టబు, జయరామ్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే తాజాగా నెట్టింట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.అదేంటంటే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసుకున్నాడని అంతేగాక ఈ కథను ఇప్పటికే ఎన్టీఆర్ కి వినిపించాడని కూడా తెలుస్తోంది.
అయితే కథ అంతా విన్నఎన్టీఆర్ కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు కావాలని అడిగాడట.అంతేగాక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ట్లు సమాచారం.దాంతో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని జూలై 30వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాడు.
దాంతో ఎన్టీఆర్ చెప్పినట్లు మార్పులు చేర్పులు చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత సమయం కూడా ఉన్నందువలన ఆర్.ఆర్.ఆర్ చిత్రం తర్వాత ఈ భారీ ప్రాజెక్టును పట్టా లెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అలాగే ఓ ప్రముఖ సినీ నిర్మాత కూడా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చినటువంటి అరవింద సమేత చిత్రం దర్శక నిర్మాతలకు మంచి కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.
దీంతో మరోసారి వీళ్ళిద్దరి కాంపిటేషన్ రిపీట్ అయితే బొమ్మ హిట్ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.