సంగీత దర్శకుడు థమన్ అల వైకుంఠపురంలో చిత్రంతో మరో స్థాయికి వెళ్లాడు.అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురంలో సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం థమన్‌కే దక్కింది.అంతా కూడా థమన్ అందించిన మంచి సంగీతం వల్లే సినిమా హిట్ అయ్యిందని అంటున్నారు.
నిన్నటి సక్సెస్ వేడుకలో కూడా థమన్‌పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
నిన్నటి సక్సెస్ వేడుకలో హీరోయిన్ పూజా హెగ్డేతో పాట పాడించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పూజా సామజవరగమన పాట పాడి టీవీలో చూస్తున్న వారిని మరియు కార్యక్రమాన్ని లైవ్ లో చూసిన వారిని కూడా మెప్పించింది.తెలుగు రాకపోవడంతో లిరిక్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడింది.
అయినా కూడా ప్రేక్షకులు ఆమె పాటను ఎంజాయ్ చేసినట్లుగా అనిపించింది.
పూజా హెగ్డే స్టేజ్ పైకి వెళ్లగానే ఆమెతో పాట పాడాలంటూ థమన్ కోరాడు.
ఆయన మాట కాదనలేక పాట ప్రారంభించింది.అయితే మద్యలో కాస్త లిరిక్ మరిచి పోయినట్లుగా అనిపించినా కూడ మొత్తానికి పూర్తి పాటను పాడింది.
పాటలోని పల్లవి మొత్తాన్ని పాడటంతో పాటు బ్యాక్ గ్రౌండ్‌లో థమన్ వేసిన దరువుతో పాటకు అదనపు ఆకర్షణ వచ్చింది.మొత్తానికి పూజా హెగ్డే ఇబ్బందిగా పాడినా కూడా ఆకట్టుకునేలా పాడింది.