విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన వెంకీ మామ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.సినిమాలో మంచి కంటెంట్ ఉండటం, వెంకటేష్ రెచ్చిపోయిన తనదైన యాక్టింగ్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.
ఇక వెంకీ-చైతూ కలిసి స్క్రీన్‌పై చేసిన హంగామా అంతా ఇంతా కాదు.దీంతో అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశారు.
అయితే గతవారం రూలర్, ప్రతిరోజూ పండగే సినిమాలు రిలీజ్ కావడంతో వీకెండ్ వరకు వెంకీ మామ కలెక్షన్లు కాస్త తగ్గాయి.కానీ రూలర్ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కేవలం ప్రతిరోజూ పండగే సినిమా మాత్రమే ప్రేక్షకులను అలరిస్తోంది.
అయితే క్రిస్మస్ సెలవు రోజున ప్రేక్షకులు తేజు సినిమాకంటే కూడా వెంకీ మామ సినిమా చూసేందుకే ఇష్టపడ్డారు.దీంతో క్రిస్మస్ రోజున వెంకీ మామ థియేటర్లు హౌజ్‌ఫుల్ బోర్డులతో కనిపించాయి.
దాదాపు రూ.37 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడం విశేషం.వెంకటేష్ సినిమాలపై నమ్మకంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు వెళుతున్నారు.జనవరి రెండో వారం వరకు మరే ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో వెంకీ మామ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
మొత్తానికి క్రిస్మస్ పండగను వెంకీ మామ ఘనంగా చేసుకున్నాడని చెప్పాలి.