జగన్‌ అనుభవ రాహిత్యమా? అతి తెలివితేటలా?

ఏపీ సీఎం పరిపాలనలో వ్యవహరిస్తున్న తీరు కొన్ని సార్లు ప్రశంసలు కురిసేలా చేస్తుంటే మరికొన్ని సార్లు విమర్శల పాలవుతుంది.గతంలో రాజశేఖర్‌రెడ్డి తీసుకు వచ్చిన పథకాలను మళ్లీ ప్రారంభించడంతో పాటు పలు సంక్షేమ పథకాలను తీసుకు వస్తున్న కారణంగా జగన్‌ను అభినందిస్తున్న విషయం తెల్సిందే.

 Ap People Not Intrested In Jagan Governament Ruling-TeluguStop.com

అయితే జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సామాన్యులకు చాలా భారం అవుతున్నాయి.రాష్ట్ర అభివృద్ది అంటూ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి.

ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేక పోతుంది.అమరావతి చుట్టు ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకుల భూములకు విలువ తగ్గించే ఉద్దేశ్యంతో జగన్‌ అమరావతి నుండి రాజధానిని తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తెలుగు దేశం పార్టీ నాయకులను దెబ్బ తీసేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెట్టడం ఏంటీ అంటూ ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై ముందుకు వెళ్లలేక, వెనక్కు తగ్గలేక జగన్‌ కిందా మీదా పడుతున్నాడు.

జగన్‌ తీసుకుంటున్న అనాలోచిత, అనుభవ రాహిత్య నిర్ణయాల వల్ల రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube