ట్రంప్ హాజరావ్వాల్సిందే...అమెరికా కోర్టు తీర్పు...!!!

అమెరికా అధ్యక్షుడైనా సరే చట్టం ముందు అందరూ సమానమే.ఆయనపై వచ్చిన అభియోగాల విచారణ ఎదుర్కోవడం కోసం తప్పకుండా యూఎస్ కాంగ్రెస్ ముందు హాజరవ్వాలి అంటూ అమెరికా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 American Donald Trump-TeluguStop.com

ట్రంప్ పై కొనసాగుతున్న విచారణలో ఆయన తన వాంగ్మూలం ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పింది.విచారణని అధ్యక్షుడు గౌరవించాలని పేర్కొంది.

ఈ మేరకు

స్థానిక జిల్లా కోర్టు న్యాయమూర్తి కేటన్జీ బ్రౌన్ జాక్సన్ వైట్ హౌస్ మాజీ సలహాదారుగా పని చేసిన మెక్ గాన్ కి స్పష్టం చేశారు.విచారణకి హాజరయ్యేందుకు చట్టపరమైన అన్ని సౌకర్యాలని కల్పించాలని వాటిని అధ్యక్షుడు ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై విచారణ జరిపిన రాబర్ట్ ముల్లర్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రతినిధుల సభ విచారణ జరుపుతున్న విషయం విధితమే.అయితే ఈ క్రమంలోనే

Telugu American, Donald Trump, Telugu Nri Ups, Trump-

అమెరికా కోర్టు ట్రంప్ హాజరుపై కీలక ఆదేశాలు ఇవ్వడం ట్రంప్ కి ఇబ్బందికర పరిణామమే అంటున్నారు నిపుణులు.అంతేకాదు అధ్యక్షుడు అయినా ఎవరైనా సరే కోర్టుల ముందు సమానమేనని , ఎవరూ అతీతులు కాదని చురకలు అంటించింది కోర్టు.మరి ఈ వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube