ఓలా, ఊబర్‌ క్యాబ్స్‌ బుక్‌ చేస్తున్నారా.. మీకో అద్భుతమైన వార్త!

క్యాబ్స్‌ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లాంటి సిటీల్లో ప్రయాణం చాలా సులువైంది.ఇంట్లో లేదా ఆఫీస్‌లో కూర్చున్న చోటు నుంచే క్యాబ్‌ బుక్‌ చేసుకునే అవకాశం కలిగింది.

అయితే క్యాబ్‌లలో ప్రయాణాలు ఇక నుంచి మరింత చౌకగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం ఓలా, ఊబర్‌లాంటి క్యాబ్‌ కంపెనీలు ఆర్జిస్తున్న కమీషన్‌ను నియంత్రించడానికి సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఇలాంటి కంపెనీలు ప్రతి రైడ్‌లో వచ్చే మొత్తంలో 20 శాతం మేర కమీషన్‌ రూపంలో తీసుకుంటున్నాయి.అయితే ఇప్పుడు దీనిని 10 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది.

ఇక ఈ క్యాబ్‌ సంస్థలు ఆర్జిస్తున్న దానిపై అదనపు పన్ను విధించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.

Advertisement

క్యాబ్‌లు బిజీ టైమ్‌లో మామూలు ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తుంటాయి.ఇవి ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటున్నాయి.ఈ ధరలను కూడా కేంద్రం నియంత్రించనుంది.

ఇది గరిష్ఠంగా కనీస ధర కంటే రెట్టింపు మాత్రమే ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది.ఈ కనీస ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా సదరు క్యాబ్‌ కంపెనీ ఫిక్స్ చేసుకోవచ్చు.

ప్రతి మూడు నెలలకోసారి ఈ ధరలను సమీక్షించుకోవచ్చు.

కొత్త ప్రతిపాదనలను వచ్చే వారమే ప్రజల ముందు ఉంచి వాళ్ల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.ఇక ఒక డ్రైవర్‌ రోజులో నడిపే మొత్తం రైడ్స్‌లో గరిష్ఠంగా పది శాతం రైడ్స్‌ ధరలు మాత్రమే పెంచడానికి వీలుంటుంది.రైడ్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే మొత్తం చార్జీలో పది నుంచి 50 శాతం వరకూ పెనాల్టీ విధించే వీలుంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇది ఇటు డ్రైవర్లకు, అటు కస్టమర్లకు వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు