ఇండోనేషియా మరోసారి భూకంపంతో కంపించి పోయింది.రిక్టర్ స్కేల్‌పై 7.1 గా ఈ భూకంపం నమోదు అయ్యిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.మొలుక్క సముద్ర తీరంలో ఈ భూకంపం టెర్నెట్ పట్టణానికి వాయవ్య దిశలో 140 కిలో మీటర్ల దూరంలో భూమిలోనికి 45 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లుగా యూఎస్ జియోలాజికల్ సర్వే వారు తెలియజేశారు.
ఈ భూకంపం తీవ్రతతో పలు ఇల్లు ద్వంసం అవ్వడంతో పాటు ఎన్నో భవనాలు నేలమట్టం అయ్యాయి.
భూకంపం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సముద్రంలో సునామి ఏర్పడే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అందుకే ముందస్తు జాగ్రత్తగా సముద్రంలో నుండి జాలర్లు బయటకు వచ్చేయాలంటూ సూచించడంతో పాటు సముద్ర తీరంలో ఉంటున్న వారిని తరలించే కార్యక్రమాలు జరుగుతున్నాయి.సముద్ర తీరంలో ఎలాంటి ఆస్తి నష్టం జరుగకుండా ఇండోనేషియా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది.
ఈ భూకంపం మళ్లీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.