పీకే శిష్యుడితో బాబు చర్చలు ? టీడీపీ వ్యూహకర్త ఆయనేనా ?

ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉంది.అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజల్లోకి వెళ్తున్న పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కనిపించడంలేదు.

 Chandrababu Planto Discussionswith Prashanth Kishore Persionalassistant-TeluguStop.com

ముందు ముందు అధికార పార్టీ వైసీపీ జోరు మరింత పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అంతేకాదు మరోవైపు బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేలా పావులు కదుపుతుండడంతో వ్యూహకర్త కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించింది.

ఈ క్రమంలో గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ శిష్యుడితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఏపీ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ అనుసరించిన రాజకీయ వ్యూహాన్నే టీడీపీ అనుసరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Chandrababu, Pachima Bengal, Ysjagan-Telugu Political News

  ప్రశాంత్ కిషోర్ అనుసరించిన వ్యూహాం ఆధారంగానే ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లోనూ, పార్టీల్లోనూ బలంగా వెళ్ళిపోయింది.అందుకే .ప్రశాంత్ కిషోర్ తరహాలోనే వ్యూహకర్త అవసరమని కొందరు టీడీపీ సీనియర్లు చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ పలు పార్టీలతో ఒప్పందాలు చేసుకున్నాడు.

ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాకర్త కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు.గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో వుహాకర్తగా పనిచేసిన అనుభవం ఉన్న రాబిన్ శర్మ అనే వ్యక్తితో చర్చలు జరిపినట్టు సమాచారం.

Telugu Chandrababu, Pachima Bengal, Ysjagan-Telugu Political News

  రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ లో పనిచేశారు.ప్రస్తుతం ఆయన ఐ ప్యాక్ ను వదిలి సొంతంగా రాజకీయ వ్యూహాలు వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.అంతేకాదు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సర్వేలు చేస్తూ జూనియర్ పీకే గా ముద్ర వేయించుకున్నాడు.ఈ క్రమంలో ఆయనతో టీడీపీ నేతలు కొంతమంది చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది.

ఆయన్నే టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా నియమించాలని బాబు కి కొంతమంది పార్టీ సీనియర్లు సూచించారట.అయితే దీనిపై తొందర్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube