వైసీపీని దెబ్బ కొడుతున్న జ‌న‌సేన‌.. బ‌ద్వేల్‌లో స‌రికొత్త వ్యూహం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌రికొత్త వ్యూహాల‌తో ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు.ఓ వైపు ప్ర‌జ‌ల్లో త‌న ఇమేజ్‌ను పెంచుకుంటూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు ప‌క్కా ప్లాన్ ను అమలు చేస్తున్నారు.

 Janasena Attacking Ycp New Strategy In Badwell , Badwell, Janasena-TeluguStop.com

ఇందుకు నిద‌ర్శ‌నంగా ఇప్పుడు జ‌రుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికను చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది.ఇక్క‌డ అంద‌రికంటే ముందుగానే జనసేన పోటీ చేయ‌ట్లేద‌ని ప్ర‌క‌టించి ఎన్నిక‌ల‌ను ఏకగ్రీవం చేయాలంటూ విజ్ఞ‌ప్తి కూడా చేసింది.

తాము రాజ‌కీయ విలువ‌ల‌ను పాటిస్తున్నామ‌ని అందుకే పోటీ చేయ‌ట్లేద‌ని చెప్పుకొచ్చింది.

దీంతో త‌ప్ప‌నిస‌రిగా టీడీపీ కూడా పోటీ నుంచి వైదొలుగుతూ వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది.

అయితే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థులు పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఇక వైసీపీ గెలుపు సునాయాస‌మే అనుకుంటున్న వేళ జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రం పోటీకి సై అంటున్నాయి.ఇక్క‌డే జ‌న‌సేన‌కు ఓ అస్త్రం దొరికిన‌ట్టు అయింది.

అదేంటంటే ఎలాగూ త‌మ‌కు బీజేపీ మిత్ర ప‌క్ష‌మే కాబ‌ట్టి తాము పోటీ చేయ‌కుండా ప్ర‌జ‌ల్లో ఇమేజ్‌ను సొంతం చేసుకుని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైసీపీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు రెడీ అయిపోయింది.కానీ ఈ ఎన్నిక‌ల్లోనూ బీజేపీతోనే త‌మ జనసేన ఉంటుంద‌ని వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించేశారు.

Telugu Badwell, Janasena, Janasenaycp-Telugu Political News

బీజేపీతో పొత్తు కార‌ణంగానే రాజ‌కీయ విలువ‌లు పాటిస్తూ ఇలా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు న‌సేన తేల్చిచెప్పింది.అంతే కాదండోయ్ రాబోయే రోజుల్లో కూడా త‌మ పొత్తు ఇలాగే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.అంటే ప‌రోక్షంగా వైసీపీకి జ‌నసేన పోటీ ఇస్తోంద‌న్న మాట‌.ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప‌వ‌న్ ప్ర‌చారంచేసే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలుస్తోంది.

బీజేపీని విజయం దిశ‌గా సాగే పనిచేస్తామంటూ జ‌న‌సేన కీల‌క నేత అయిన నాదెండ్ల మనోహర్ చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తూనే జ‌న‌సేన వైసీపీ మీద ఎంత‌లా క‌సిగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube