మార్కెట్‌లో మనకు ఎన్నో రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి.ఏ రకానికి చెందిన స్వీటు అయినా కేజీ దాదాపుగా రూ.300 పైనే ఉంటుంది.ఇక కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు కేజీ రూ.600 నుంచి రూ.800 వరకు పలుకుతాయి.కానీ ఇప్పుడు మేం చెప్పబోయే స్వీటు ఖరీదు ఎంతో తెలుసా.? తెలిస్తే షాకవుతారు.కేజీ స్వీటు ఏకంగా రూ.9వేలు.అవును, మేం చెబుతోంది నిజమే.ఆ స్వీటు ఖరీదు అక్షరాలా కేజీకి రూ.9వేలు.ఇంతకీ అంత ఖరీదు ఉండడానికి ఆ స్వీట్‌లో ఏం ప్రత్యేకత ఉంది.? అనేగా మీ డౌట్.ఏమీ లేదండీ.
ఆ స్వీటులో బంగారం వాడుతారు.అందుకే అంత ఖరీదు మరి.!
గుజరాత్‌లోని సూరత్‌లో 24 క్యారెట్స్ మిఠాయి మ్యాజిక్ అనే ఓ స్వీట్ షాప్ ఉంది.అందులోనే పైన చెప్పిన బంగారం స్వీట్లను తయారు చేస్తున్నారు.ఆ స్వీట్లపై ఆకులవలె బంగారం పూత ఉంటుంది.అంటే మనకు మన దగ్గర్లోని స్వీట్ షాపుల్లో లభించే కొన్ని స్వీట్లపై వెండి పూత వేస్తారు కదా.అలాగే ఆ షాప్‌లోని స్వీట్లపై బంగారు పూత ఉంటుందన్నమాట.దీంతో ఆ స్వీట్లను గోల్డ్ స్వీట్స్ అని కూడా పిలుస్తున్నారు.
ఇక ఈ స్వీట్ల ఖరీదు.ముందే చెప్పాం కదా.కేజీకి రూ.9వేలు.
అంత ఖరీదు ఉన్నప్పటికీ గోల్డ్ స్వీట్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారని స్వీటు షాపు యజమాని చెప్పుకొచ్చాడు.బంగారంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయని, ఇవి శరీరంలో నొప్పులు, వాపులను తగ్గిస్తాయని, దీంతోపాటు క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అతను చెబుతున్నాడు.సోనా-చ్యవన్‌ప్రాశ్ ఎలాగైతే మనకు ఆరోగ్యాన్నిస్తుందో అలాగే ఈ గోల్డ్ స్వీట్లతోనూ మనకు ఆరోగ్యం కలుగుతుందని అతను చెబుతున్నాడు.ఇక గత ఆగస్టు నెలలో రక్షాబంధన్ సందర్భంగా ప్రారంభమైన ఈ గోల్డ్ స్వీట్ల తయారీ ఇప్పటికీ కొనసాగుతోంది.
కస్టమర్లు విరివిగా ఈ స్వీట్లను కొంటున్నందునే వాటిని ఇప్పటికీ తయారు చేస్తున్నామని షాపు ఓనర్ చెబుతున్నాడు.ఏది ఏమైనా.గోల్డ్ స్వీట్ల కథాకమామీషు భలేగా ఉంది కదా.! ఇకపై ప్రపంచంలో ఖరీదైన స్వీటు ఏది అంటే.
ఈ స్వీట్లే గుర్తుకు వస్తాయి కాబోలు.!