వేణు మాధవ్ మృతి నుండి తెలుగు సినిమా పరిశ్రమ తేరుకోలేక పోతుంది.అతి చిన్న వయసులోనే ఆయన చనిపోవడం పట్ల సినీ ప్రముఖులు పలువురు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరోలందరితో కూడా వేణు మాధవ్ నటించి నవ్వులు పూయించాడు.ప్రతి స్టార్‌తో కామెడీ చేసి, వారితో మంచి బాండింగ్‌ను ఏర్పర్చుకున్న వేణు మాధవ్ మృతి చెందిన తర్వాత ఒక విషయం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
అదేంటి అంటే వేణు మాధవ్ చాలా ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్‌కు ఒక బియ్యం బస్త పంపించేవాడట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.వేణు మాధవ్‌కు తన సొంత ఊర్లో పొలం ఉండేది.ఆ పొలంలో పండిన వడ్లను బియ్యంగా మార్చి వాటినే తినేందుకు హైదరాబాద్‌కు వేణు మాధవ్ తెప్పించుకునే వాడు.
ఆ బియ్యం బస్తాల్లోంచి ఒక బస్తాను ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్‌కు పంపించేవాడట.తన పొలంలో పండిన పంట అంటూ పవన్ కళ్యాణ్‌కు చెప్పి మొదటి సారి ఇచ్చి ఆ తర్వాత వరుసగా పంపించేవాడట.
వేణు మాధవ్‌పై ఉన్న అభిమానంతో పవన్ కూడా స్వీకరించేవాడు.వేణు మాధవ్ బియ్యంకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది పవన్ తన మామిడి తోటలో కాసే మామిడి కాయలను వేణు మాధవ్‌కు పంపించేవాడట.
అలా ఇద్దరి మద్య మంచి అనుబంధం కొనసాగిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ మరియు వేణు మాధవ్‌లు పలు సినిమాల్లో కలిసి నటించారు.
వేణు మాధవ్ వృతిపై పవన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా కూడా సమాచారం అందుతోంది.