అసలే తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీ బిజెపి నాయకులు ఇక్కడ తమ హవా చూపిస్తూ వస్తున్నారు.రోజురోజుకి ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటూ ఏపీలో బీజేపీని మరింత బలిష్ఠం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
దీనికి బీజేపీ అధిష్టానం పెద్దలు కూడా తగిన విధంగా సలహాలు, సూచనలు ఇస్తూ సహకరిస్తున్నారు.ఎన్నికల ముందు వరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఇతర నాయకులపై దుమ్మెత్తిపోసిన బిజెపి నాయకులు లు వైసీపీతో సఖ్యత గా ఉంటూ ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా తమ వంతు సహకారం అందించారు.
బిజెపి పరోక్ష మద్దతు వైసీపీ కూడా ఎన్నికల్లో భారీ స్థాయిలో సీట్లను సంపాదించుకోగలిగింది.అయితే ఆ తరువాత తరువాత బిజెపి నాయకులు తమ పంద ఒక్కసారిగా మార్చుకున్నట్టు కనిపించరు.
వైసీపీ కూడా తమకు ప్రధాన శత్రువే అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

మెల్లిగా వైసీపీ మీద విమర్శలు చేస్తూ పరోక్షంగా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు.దీనంతటికీ కారణం చంద్రబాబు కోటరీ నాయకులుగా పేరు పొందిన రాజ్యసభ సభ్యులు కొంతమంది వివిధ కారణాలతో బీజేపీలో చేరారు.ఇక అప్పటి నుంచి చంద్రబాబు కు మద్దతుగా ఏపీ బీజేపీ మారిపోయింది.
అదే సమయంలో కేంద్రంతో వైసీపీ అధినేత జగన్ సఖ్యత పాటిస్తూ వస్తున్నారు.తాము ఏపీలో చేసే అన్ని వ్యవహారాలూ కేంద్రంతో చెప్పే చేస్తున్నామంటూ చెబుతున్నారు.
అయినా ప్రస్తుతం ఏపీ బిజెపి రెండు వర్గాలుగా చీలినట్టు తేలిపోయింది.ఒక వర్గం వారు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతుంటే మరో వర్గం చంద్రబాబు మీద భారీగా విమర్శలు చేస్తోంది.

ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై సుతిమెత్తగా విమర్శలు చేస్తూ, జగన్ ప్రభుత్వం పై భారీగా విమర్శలు చేస్తున్నారు.అదే సమయంలో రావెల కిషోర్ బాబు, మరికొంతమంది బిజెపి నాయకులు జగన్ ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ తెలుగుదేశం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.అమరావతి, కృష్ణా నది కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసం ఉండడంపైన, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆ నాయకులు గట్టిగా మాట్లాడుతుండగా మరో వర్గం మాత్రం ప్రభుత్వ చేయాలను కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణిస్తోంది.ఇటువంటి కొన్ని కొన్ని సంఘటనలు ఏపీ బిజెపి రెండుగా చీలింది అనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
.