బ్రేగ్జిట్ వ్యవహారం లో ఎంపీల మద్దతు కూడగట్టడం తో విఫలమైన నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాని థెరిస్సా మే జూన్ 7 న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలో అన్న దాని కోసం అక్కడ నేతల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది.
ఈ రేసులో ముందుగా బ్రిటిష్ మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు.మరోపక్క ప్రధాని పదవికి తాను కూడా పోటీ పడుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మాటి హాన్‌కాక్ శనివారంనాడు బిబిసికి వెల్లడించారు.
ఉన్నత పదవి రేసులో తాను లేనని చెప్పిన హోం శాఖ మంత్రి అంబర్ రూడ్ పార్టీని ఐక్యంగా నడపగలిగిన సత్తా ఉన్న నాయకులెవరైన ప్పటికీ, వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు.మరోపక్క జాన్సన్ మాట్లాడుతూ, ఒప్పందం కుదిరినా, కుదరకున్నా అక్టోబర్ కల్లా ఇయు నుంచి బ్రిటన్ నిష్క్రమిస్తుందని తెలిపారు.
అయితే జూన్ 7 న మే రాజీనామా చేయడం తో టోరీ పార్లమెంటరీ పార్టీ కొత్త నేత ఎంపిక ప్రక్రియ జూన్10నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండు నెలలకు పైగా పడుతుంది.
బ్రెగ్జిట్‌కు తాజాగా నిర్ణయించిన గడువు అక్టోబర్ 31 కాగా, కొత్తగా ఎంపికయ్యే ప్రధాని మరింత వ్యవధి కావాలని కోరే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.మరోపక్క మే పదవి నుంచి నిష్క్రమించిన తరువాత ఎన్నికైన ఎవరైనా కూడా వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరిమీ కార్బిన్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ గోడవల మధ్య బ్రిటన్ లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి.ఎప్పుడు ఏమి జరుగుతుంది అని ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారు.మరోపక్క విశ్లేషకులు కూడా మే వారసులు ఎవరు ఎన్నికైన వెంటనే ఎన్నికలకు వెళితే మాత్రం పెద్ద దెబ్బె అని సూచిస్తున్నారు.మరి అక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకొంటాయో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.