అరియానా మర్డర్ మిస్టరీ చేధించిన అమెరికా పోలీసులు..

అమెరికాలో సంచలనం రేపిన ఘటన అరియానా ఫ్యూన్స్ అనే బాలిక దారుణ హత్య.ఈ మిస్టరీని పోలీసులు చెందించారు.

 American Police Solve The Ariana Murder Mystery-TeluguStop.com

గత నెల 11 తేదీన తాను ఉంటున్న యూత్ గ్రూప్ హోం నుంచీ పారిపోయిన ఆమె తనకి తెలిసిన ఓ వ్యక్తిని తో కలిసి బెంనింగ్ మెట్రో స్టేషన్ వద్దకి కారులో వెళ్తూ ఉంది.అయితే మార్గ మధ్యలో వీరి కారుని అడ్డగించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు.

వారిని కారులోంచి దొంచి అతడిపై విచక్షణా రహితంగా దాడిచేశారు.

సదరు వ్యక్తి నుంచీ 500 డాలర్లు, ఏటీఎమ్ కార్డులు లాక్కున్నారు.

దాంతో అక్కడే ఉన్న అరియానా అతనిని హింసించవద్దంటూ దుండగులని బ్రతిమిలాడటంతో అతడిని వదిలేశారు.కానీ వ్యూహం ప్రకారం అరియానా చేత అతడిని కిడ్నాప్ చేయించాలని భావించిన అతడి గ్యాంగ్ కి ఈ విషయం తెలియడంతో అరియానాపై అనుమానం వచ్చింది.

ఈ విషయం పోలీసులకి ఎక్కడ చెప్తుందోననే భయంతో ఆమెని అడ్డు తొలగించాలని అనుకున్నారు.

అందులో భాగంగానే ఏప్రిల్ 18న అరియానాను మేరీలాండ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్ళారు.

వీరిలో ఎస్కోబార్ ఆమెను వివస్త్రను చేసి చెక్క బ్యాట్ తో తలపై బలంగా కొట్టాడు.అక్కడే ఫ్యూంటెన్స్ కత్తి తో అత్యంత దారుణంగా దాడి చేశాడు.ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు.అయితే ఈ ఘటనలో వారికి హెర్నాండెజ్ అనే బాలిక సహకరించినట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఈ ఘటన జరిగే సమయంలో హెర్నాండెజ్‌ను బయటే నిలబెట్టారు.విచారణ సమయంలో ఆమె ముందుగా ఓ ఆడమనిషి అరుపులు విన్నానని తెలిపింది.కాసేపటికి రక్తంతో కూడిన ముఖంతో ఎస్కోబార్‌, ఫ్యూంటెన్స్ బయటికి వచ్చారని తెలిపింది.హెర్నాండెజ్ తో పాటు హంతకులని అరెస్ట్ చేసిన పోలీసులు, వారికి సహకరించిన మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube