కాయ్ రాజా కాయ్ ! తెలంగాణాలో జోరందుకున్న బెట్టింగులు కోట్లలో

మొన్నటి వరకు క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగాయి.ఈ ముసుగులో పందెం రాయుళ్లు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు.

 Huge Bettings On Telangana Elections-TeluguStop.com

ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికలు రసవత్తరంగా జరగబోతుండడంతో ఈ పందెం రాయుళ్ల చూపు ఇటువైపు పడింది.కూటమిలోని పార్టీలు ఒకవైపు… టీఆర్ఎస్.బీజేపీ… ఎంఐఎం తదితర పార్టీలు ఒకవైపు ఎన్నికల పోరులో తలపడేందుకు సిద్ధం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో … ప్ర‌ధాన పార్టీలకు సంబంధించిన కీల‌క నాయకుల గెలుపుపై జోరుగా బెట్టింగులు మొద‌ల‌య్యాయి.

ఇప్పటికే నువ్వా.నేనా అనే రేంజ్ లో గట్టి పోటీ వాతావరణం ఏర్పడిన నియోజకవర్గాలపై కోట్ల‌లో బెట్టింగులు మొదలవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ సారి ఎన్నిక‌ల్లో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ముంబై కేంద్రంగా బూకీలు కోట్ల‌ల్లో బెట్టింగుల‌కు దిగుతున్నట్టు సమాచారం.

ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేయబోతున్న గజ్వేల్ నియోజకవర్గంలో మళ్ళీ ఆయనే భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అంటూ… కోట్లాది రూపాయల బెట్టింగులు కాస్తున్నారు.ఈ నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యర్థిగా… ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి పోటీ ప‌డుతున్నాడు.అలాగే అత్యంత ఖరీదైన నియోజక వర్గం అయిన శేరిలింగం పల్లి లో కూడా గెలుపు ఎవరిదనే విషయంలో కోట్లలో బెట్టింగ్ లు సాగుతున్నాయి.

ఇంకా సిరిసిల్ల, జగిత్యాల లో కూడా చాలా తీవ్ర పోటీ ఉన్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్ళు పందాలు కాసేందుకు పోటీలు పడుతున్నారు.ఇక న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ నుంచి పోటీప‌డుతున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి పైన కూడా బెట్టింగ్ లు గట్టిగానే కాస్తున్నారా.ఈ స్థానం నుంచి ఏడు సార్లు విజ‌యం సాధించిన జానా ఎనిమిద‌వ సారి కూడా విజ‌యం సాధించి రికార్డు నెల‌కొల్పాల‌ని ప్లాన్ చేస్తుంటే అత‌నికి పోటీగా నిలిచిన నోముల న‌ర్సింహ‌య్య ఈ సారి జానాను ఓడించ‌డం ఖాయం అంటూ పందెం కాస్తున్నారు.

అదేవిధంగా… కాంగ్రెస్ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పోటీకి దిగుతున్న హుజూర్‌న‌గ‌ర్‌లోనూ ఇదే తంతు.ఉత్త‌మ్‌కు పోటీగా నిలిచిన తెరాస అభ్య‌ర్థి సైదిరెడ్డి గెలుపొంద‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ఇక్క‌డ కోట్ల‌ల్లో బెట్టింగ్ కాస్తున్నారు.మరీ ముఖ్యంగా చెప్పుకుంటే… టీఆర్ఎస్ కి ముచ్చెమటలు పట్టిస్తున్న రేవంత్ రెడ్డి మీద అయితే బెట్టింగులు కాసేందుకు తీవ్ర పోటీ నెలకొందట.

రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగ‌ల్‌లో ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి సోద‌రుడు ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి పోటీప‌డుతున్నాడు.ఈ స్థానం కోసం ఇరు పార్టీల‌కు సంబంధించిన సానుభూతిప‌రులు దాదాపు ఐదు కోట్ల మేర బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube