లోకేష్ కి షరతులు...ఖంగుతిన్న నేతలు..!!!

తెలంగాణలో ఒకపక్క ఎన్నికల హడావిడి నేతలలో హై టెన్షన్ తెప్పిస్తుంటే.మరో పక్క ఎన్నికల ప్రచారం వగైరా వగైరా వంటి విషయాలపై పార్టీలలో తీవ్ర చర్చలు మొదలయ్యాయి.

 Telangana Tdp Leaders Conditions To Nara Lokesh-TeluguStop.com

ప్రచార వ్యూహాలపై ఇప్పటికే పార్టీలలోని కీలక వ్యక్తులని, పార్టీలకి సంభందించిన సినిమా గ్లామర్ ని దించాలని వారితో ఏ విధంగా ప్రచారం చేయించాలి, నియోజకవర్గాల వారీగా స్క్రిప్ట్ విధానాలని సిద్దం చేసి ఉంచారు.అయితే ఇక్కడే మరొక షాక్ తగిలింది తెలంగాణా ప్రచార వ్యుహకర్తలకి అదేంటంటే.

లోకేష్ తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించడం.

లోకేష్ ప్రచారం చేయడం ఏమిటి అంటూ ఆందోళనలో ఉన్నారట వ్యుహకర్తలు.ఇదిలాఉంటే తెలంగాణలో ఎన్నికలపై ఇన్నాళ్ళకి స్పందించిన లోకేష్ బాబు ఇప్పుడు ప్రచారం చేస్తానని ప్రకటించేశారు.ఇప్పటివరకూ కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై నోరు విప్పని లోకేష్ బాబు ఇప్పుడు మాత్రం ప్రచారానికి సై సై అంటున్నారు…నా అవసరం ఉందనుకుంటే తప్పకుండా ప్రచారానికి వెళ్తానని తెలిపారు.

దాంతో ఒక్క సారిగా తెలంగాణా ప్రచార కమిటి ఖంగారు పడిందట.గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు కానీ అప్పట్లో కేవలం ఒకే ఒక్క సీటుని మాత్రం గెలుపొందింది.

దాంతో లోకేష్ బాబు స్టామినా పై ఒక అంచనాకి వచ్చేశారు అయితే ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని లోకేష్ వస్తే కొన్ని కండిషన్లు ఉన్నాయ్ అంటూ సైలెంట్ గా నొక్కి మరీ చెప్పారట దాంతో లోకేష్ కి కండిషన్స్ నా అంటూ టీడీపీ నేతలు నోళ్ళు వెళ్ళబెట్టారట.

ఇంతకీ ఏమిటా కండిషన్స్ అంటే.తాము ఇచ్చిన స్క్రిప్ట్ కంటే ఒక్క ముక్క కూడా ఎక్కువగా చెప్పకూడదు.సొంత పద ప్రయోగాలు చేయకూడదు.

అంతేకాదు తప్పకుండా ముందస్తుగా ఏర్పాటు చేసే క్లాసులకి రావాల్సిందే అంటూ చాంతాడు అంత లిస్టు ముందు పెట్టాలని టాక్ వినిపిస్తోంది.మరి ఈ కండిషన్స్ కి చంద్రబాబు గారి అబ్బాయి ఒప్పుకుంటారా లేక ప్రచారం నుంచీ తప్పుకుంటారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube