పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పాప్ కార్న్ గురించి ఈ విషయాలు తెలుసా?

కొవ్వు తక్కువ పీచు ఎక్కువగా ఉండే పాప్ కార్న్ లో పండ్లలో కంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తెలిసింది.పాప్ కార్న్ లో ఉండే పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యర్ధాలతో పోరాటం చేసి అనారోగ్యం కలగకుండా కాపాడతాయి.

 Popcorn Health Benefits-TeluguStop.com

అంతేకాకుండా రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

మనం ఒక్కసారి తినే పాప్ కార్న్ లో 300 ఎంజి పాలీఫెనాల్ ఉంటుంది.

పాప్ కార్న్ పైన ఉండే పొట్టు కూడా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మనం సాధారణంగా తినే అన్ని రకాల స్నాక్స్ లలో పాప్ కార్న్ చాలా మంచి ఆహారం.

ఇది నూటికి నూరు శాతం గింజధాన్యాల ఆహారం.పాప్ కార్న్ ప్రాసెస్ చేసిన ఆహారం కాదు కాబట్టి ప్రతి రోజు పాప్ కార్న్ తిన్నా ఎటువంటి ఇబ్బందులు రావు.

అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే పాప్ కార్న్ తయారీ చేసినప్పుడు నూనె,వెన్న,ఉప్పు,పంచదార వంటివి చేర్చకూడదు.ఒకవేళ చేరిస్తే కాస్త ఆరోగ్యానికి హానికరమే అని చెప్పాలి.పాప్ కార్న్ తినటం వలన కేలరీలు తక్కువ ఉండటం మరియు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన బరువు తగ్గేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు.అలాగే పాప్ కార్న్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube