రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్, రుహాణి నటించిన చి ల సౌ హిట్టా.? స్టోరీ, రివ్యూ...రేటింగ్ తెలుగులో

Movie Title : చి ల సౌ

Cast & Crew:
నటీనటులు: సుశాంత్,రుహానీ శర్మ,వెన్నెల కిషోర్,విద్యుల్లేఖ రామన్ తదితరులు
దర్శకుడు: రాహుల్ రవీంద్రన్
నిర్మాత: నాగార్జున అక్కినేని
సంగీతం: ప్రశాంత్ విహారి

 Chi La Sow Movie Review And Rating-TeluguStop.com

STORY:

లైఫ్‌లో ఏది కావాలో తెలియక కన్ఫ్యూజ్‌లో ఉండే అర్జున్ (సుశాంత్) పెళ్లి ఊసు ఎత్తితేనే పారిపోతాడు.అలాంటి అర్జున్ జీవితం అంజలి (రుహానీ)తో పెళ్లిచూపులతో మలుపు తిరుగుతుంది.

అంజలి పెళ్లిప్రయత్నాలు ఒక్కొక్కటిగా తన తల్లికి ఉన్న అనారోగ్యం కారణంగా చెడిపోతూ ఉంటాయి.దీంతో తాను బ్రతికి ఉంటే తన కూతురు పెళ్లి జరగదని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది.

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి కుటుంబానికి ఆసరాగా ఉన్న అంజలి ఎలాగైనా తల్లి కోరికను తీర్చడానికి అర్జున్‌తో పెళ్లి చూపులకు ఒప్పుకుంటుంది.ఒక్కరాత్రిలో అర్జున్‌తో అంజలి పెళ్లి చూపులు పెళ్లిపీటలకు చేరాయా? అంజలి.అర్జున్‌కు ఎందుకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది? చివరికి చి.ల.సౌ కథలో సౌ.ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే.

REVIEW:

ఆడియన్స్‌కి ప్రారంభంలోనే ఈజీగా కనెక్ట్ అవుతుంది ‘చి.ల.సౌ’.పెళ్లి అనే సింపుల్‌ లైన్‌ను తీసుకుని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ‘చి.ల.సౌ’ కథను అందంగా మలిచాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.సున్నితమైన భావోద్వేగాలతో రియలిస్టిక్ ప్రేమకథను అందించారు దర్శకుడు.అందమైన లొకేషన్లు, భారీ యాక్షన్ సీన్లు లాంటి హంగామా లేకుండా కేవలం పాత్రల ద్వారా కథను నడిపించారు.కథలో కూడా పెద్దగా సస్పెన్స్ లు పెట్టకుండా సింపుల్ గా తెరకెక్కించారు.ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్‌గా సాగుతూ మంచి ఇంట్రెస్టింగ్ నోట్‌లో సాగుతుంది.

ప్రీ ఇంటర్వెల్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకోవడం, అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు అనిపించినా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ త‌ర్వాత క‌థ గాడిన పడుతుంది.ఇక క్లైమాక్స్ వరకూ కథలో అక్కడక్కడా లాజిక్ మిస్ అయ్యే సీన్లు ఉన్నప్పటికీ ఎమోషనల్ లవ్ జర్నీలో కవర్ అయిపోయాయి.

చాలా ఏళ్ల తరువాత సుశాంత్‌లోని నటుడ్ని బయటకు తీసుకువచ్చాడు దర్శకుడు.లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్‌ను బాగానే పండించ గలిగాడు.రుహానికిమేకప్ లేకుండా పింపుల్స్‌తో నటించి పాత్రకు రియాలిటీని తెచ్చింది రుహాని.తొలి చిత్రమే అయినప్పటికీ ఫైర్‌ క్రాకర్‌ పెర్ఫామెన్స్ ఇచ్చింది.

అంజలి పాత్రలో చాలా అందంగా కనిపించింది.ఆమె పాత్రకు చిన్మ‌యి డ‌బ్బింగ్ మరింత బలాన్ని ఇచ్చింది.

హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి, హీరో తల్లి పాత్రలో అను హాసన్ పాత్రలకు న్యాయం చేశారు.ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది.

హీరో ఫ్రెండ్ సుశాంత్ క్యారెక్టర్‌లో ఫుల్ ఫన్ అందించాడు.మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న కాసేపు ఆకట్టుకోగలిగారు.

ఇక హీరోయిన్ చెల్లిగా నటించిన విద్యుల్లేఖ రామన్‌ ఉన్నంతలో పర్వాలేదనిపించింది.

PLUS POINTS:

డైరెక్షన్
సింపుల్ స్టోరీ
సుశాంత్ యాక్టింగ్
రుహాణి గ్లామర్
వెన్నెల కిషోర్ కామెడీ

MINUS POINTS:

సాగదీసిన కొన్ని సన్నివేశాలు
మ్యూజిక్
ఎడిటింగ్
లాజిక్ లేని కొన్ని సీన్స్

FINAL VERDICT:

ఎలాంటి మలుపులు లేకుండా సింపుల్ గా సాగే ఎమోషనల్ లవ్ డ్రామా “చి ల సౌ”.ఫామిలీ ఆడియన్స్ కి తప్పక నచ్చుతుంది.

Rating: 3 /5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube