ఈ రోజుల్లో బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.బరువు తగ్గి స్లిమ్ గా మారటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.
విపరీతమైన డైట్,కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు.అయినా పెద్దగా ప్రయోజనం కనపడదు.
దాంతో విసుగు వచ్చేస్తుంది.అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే శరీరానికి పోషకాలను అందించటమే కాకుండా బరువును తగ్గటానికి సహాయపడుతుంది.
ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.
ఆలివ్ నూనెతో వంటలను చేసుకుంటే శరీరంలో మంచి కొలస్ట్రాల్ ని పెంచటమే కాకుండా కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి.
దాంతో ఆకలి తొందరగా వేయదు.
ఆపిల్స్ లో పీచు ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉండుట వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
అంతేకాక ఆపిల్స్ లో ఉండే పెక్టిన్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
టమోటాలో కేలరీలు తక్కువగా ఉండి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన క్యాన్సర్, గుండె జబ్బులను నివారించటమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.
నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉండుట వలన మీ జీవప్రక్రియ పెంచి స్లిమ్ గా ఉంచుతుంది.ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను సైతం దూరం చేస్తుంది.
వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది.వాల్ నట్స్ ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు.