పెళ్లి అంటే ఇష్టం లేని రాశులు ఏమిటో తెలుసా?

మన పెద్దవారు పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని అంటూ ఉంటారు.ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగి పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు జేవితం అంతా కలిసి ఉండాలి.

 These Zodiac Signs Must Never Get Married-TeluguStop.com

ఆలా వారు కలిసి ఉండాలంటే ఇద్దరు సర్దుకుపోవాలి.ఎందుకంటే వారిద్దరి ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి.

పెళ్లి అనగానే మన పెద్దవారు జాతకాలు చూస్తూ ఉంటారు.జాతకం కలిస్తే వారు జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం.

కొన్ని రాశుల వారు బాగా కలిసిపోతారు.కొన్ని రాశుల వారు కలవటం కష్టం.

అయితే ఇప్పుడు పెళ్లి అంటే ఇష్టం లేని రాశుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారు జీవితంలో కొన్ని నియమాలను పెట్టుకొని అందరికన్నా ముందు ఉండి మరొకరిపై పెత్తనం చేయాలని భావిస్తారు.

వీరికి నియమాలు,నమ్మకాలు ఎక్కువ.వీరు వారి నమ్మకాల ముందు ఎవరికి తలవంచరు.

వీరి నియమాల కారణంగా బంధంలో ఉండటానికి చాలా కష్టపడతారు.వీరి నియమాల కారణంగా వీరి భాగస్వాములకు చిరాకు కలుగుతుంది.

వీరు తామే గొప్పవారమని ఫీల్ అవుతూ ఉంటారు.అందుకే వీరిని అందరు స్వార్ధపరులు అని అంటారు.


మిధున రాశి
ఈ రాశి వారు మంచి మాటకారులు.వీరు ఏమి మాట్లాడిన అర్ధవంతంగా,ఆత్మవిశ్వాసం కనపడుతుంది.వీరు అసలు దీర్షకాలిక బంధాల గురించి అసలు మాట్లాడరు.వీరు డేటింగ్ అంటే ముందుకు వస్తారు.దీర్ఘ కాళిక సంబంధాలు అంటే వెనకడుగు వేస్తారు.

ధనస్సు రాశి
ఈ రాశి వారు జీవితాన్ని సీరియస్ గా తీసుకోరు.

ఎప్పుడు సరదాగా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు.వీరు డేటింగ్ అంటే ముందడుగు వేస్తారు.

వీరు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.కాబట్టి వీరి నోటి నుండి అసలు దీర్ఘ కాళిక సంబంధాల గురించిన ప్రస్తావన ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube