వయసు అనేది కేవలం శరీరానికే, మనసుకి కాదని అతగాడు నిరూపించాడు.ఈ రోజుల్లో చాలా మంది 30 ఏళ్లకే దుకాణం సర్దేసిన పరిస్థితి.
ఇక కాలేజుకి సెలవు వచ్చిన నెక్స్ట్ రోజు వెళ్లాలంటే చాలా బద్దకంగా అనిపించి బంకు కొడుతూ వుంటారు.అలాగే ఉద్యోగులు కూడా.
మళ్లీ సెలవు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తారు.అంటే ఇక్కడ అర్ధమౌతున్నది ఏమంటే? చేయవలసిన పని చేయడానికి మనవాళ్లకు ఒల్లొంగని పరిస్థితి.బహుశా అందులో మనం కూడా ఉంటాం అనుకుంటా… చెక్ చేసుకోండి!
అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 98ఏళ్ల వయసులో( 98 Years Old ) కూడా వారానికి 7 రోజులు పనిచేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.చికాగోకు( Chicago ) చెందిన జో గ్రియర్( Joe Grier ) అనే వ్యక్తి ఇటీవలే తన 98వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.దేశంలోని అత్యంత పురాతన పూర్తి-కాల ఉద్యోగులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న గ్రియర్.చికాగోలో ఉన్న ఒక ఉత్పాదక సంస్థ అయిన విక్టరీలో విధులు నిర్వహిస్తున్నారు.అక్కడ అతను ట్రోఫీలు, అవార్డుల అచ్చులను రూపొందిస్తూ ఉంటారు.ఈ సందర్భంగా అతని స్టోరీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా ఓ మీడియా వేదికగా ముఖాముఖిలో పాల్గొన్న గ్రియర్. తన సంతోషాన్ని, పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని వ్యక్తం చేశారు.ఆయన తన పనిని ఓ హ్యాబిట్ గా అలవర్చుకున్నానని, తనకు పని ఓ అలవాటుగా మారిపోయిందని, అందుకే ఆ పనంటే ఆయనకు చికాగు ఉండదని చెబుతున్నారు.గ్రియర్ తన అచంచలమైన అంకితభావానికి విక్టరీ ప్రెసిడెంట్ ఎరిక్ ప్రైస్‌మాన్ కూడా మెచ్చుకున్నారు.సంవత్సరాలుగా కంపెనీకి అనేక సేవలందించిన అతన్ని ఆయన విలువైన సలహాదారుగా అభివర్ణించారు.COVID-19 మహమ్మారి ఎదుర్కొంటున్న సమయంలోనూ గ్రియర్ కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి విక్టరీ ప్లాంట్‌ను సందర్శించడాన్ని కొనసాగించారు.