“హెచ్‌-4” వీసాలలో 93 శాతం మంది...“భారత ఎన్నారైలే”

అమెరికా వంటి అగ్రరాజ్యంలో భారతీయుల హవా ఎంతగా ఉంటుంది అనడంతో ఈ మధ్యనే అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తున్న వీసాల జారీ రిపోర్ట్ లు చెప్తున్నాయి.హెచ్ -1B వీసాని పొందటంలో చైనా సైతం మనకంటే వెనుక స్థానంలో ఉందంటే భారతీయుల ప్రతిభని అమెరికా ఎలా ఉపయోగించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

 93 Percent Of H 4 Us Visa Holders Are Indians-TeluguStop.com

పక్కా లెక్కలతో సహా హెచ్ -1B వీసా పొందిన వారిలో భారతీయులే అత్యధికులని తేల్చి చెప్పింది.

ఇదిలాఉంటే ఇప్పుడు హెచ్‌-4 వీసాలు పొంది వారిలో కూడా అత్యధికులు లిస్టు ప్రకటించింది అమెరికా ఈ సారి ఈ రిపోర్ట్ లో ఏకంగా భారత్ నుంచీ అమెరికాకి ఈ వీసా ద్వారా వచ్చిన వాళ్ళు ఏకంగా 93 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది.అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాముల కోసం ఈ హెచ్‌-4 వీసాలు మంజూరు చేస్తారు.హెచ్‌4 వీసాలు పొందినవారిలో ఐదో వంతు కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.

అయితే విశేషం ఏమిటంటే ఉపాధి కోసం మంజూరు చేసిన హెచ్‌4 వీసాల్లో 93 శాతం మహిళలకు జారీచేయగా.7 శాతం పురుషులకు జారీ చేశారు.అంటే ఈ వీసా ద్వారా అమెరికాలోకి వచ్చిన వారిలో అత్యధికులు మహిళలేనని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్తున్నారు యూఎస్‌ కాంగ్రెస్‌ స్వతంత్ర కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సంస్థ(సీఆర్‌ఎస్‌) ఈ నివేదికను వెల్లడించింది.యూఎస్‌ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాలానుగుణంగా ఈ సంస్థ నివేదికలను సిద్ధం చేస్తుంది.

“హెచ్‌-4” కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారత్‌కు చెందిన వారికి మంజూరు చేశాం.చైనాకు 5 శాతం జారీ చేయగా ఇతర దేశాలకు చెందిన వారికి 2 శాతం వీసాలిచ్చాం’ అని సీఆర్‌ఎస్‌ తన 9 పేజీల నివేదికలో వెల్లడించింది…అయితే…2017, డిసెంబర్‌ 25 నాటికి హెచ్‌4 వీసాదారుల 1,26,853 దరఖాస్తులను అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ఆమోదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube