“హెచ్‌-4” వీసాలలో 93 శాతం మంది...“భారత ఎన్నారైలే”

అమెరికా వంటి అగ్రరాజ్యంలో భారతీయుల హవా ఎంతగా ఉంటుంది అనడంతో ఈ మధ్యనే అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తున్న వీసాల జారీ రిపోర్ట్ లు చెప్తున్నాయి.

హెచ్ -1B వీసాని పొందటంలో చైనా సైతం మనకంటే వెనుక స్థానంలో ఉందంటే భారతీయుల ప్రతిభని అమెరికా ఎలా ఉపయోగించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

పక్కా లెక్కలతో సహా హెచ్ -1B వీసా పొందిన వారిలో భారతీయులే అత్యధికులని తేల్చి చెప్పింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇదిలాఉంటే ఇప్పుడు హెచ్‌-4 వీసాలు పొంది వారిలో కూడా అత్యధికులు లిస్టు ప్రకటించింది అమెరికా ఈ సారి ఈ రిపోర్ట్ లో ఏకంగా భారత్ నుంచీ అమెరికాకి ఈ వీసా ద్వారా వచ్చిన వాళ్ళు ఏకంగా 93 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది.

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాముల కోసం ఈ హెచ్‌-4 వీసాలు మంజూరు చేస్తారు.

హెచ్‌4 వీసాలు పొందినవారిలో ఐదో వంతు కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.

!--nextpage అయితే విశేషం ఏమిటంటే ఉపాధి కోసం మంజూరు చేసిన హెచ్‌4 వీసాల్లో 93 శాతం మహిళలకు జారీచేయగా.

7 శాతం పురుషులకు జారీ చేశారు.అంటే ఈ వీసా ద్వారా అమెరికాలోకి వచ్చిన వారిలో అత్యధికులు మహిళలేనని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్తున్నారు యూఎస్‌ కాంగ్రెస్‌ స్వతంత్ర కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సంస్థ(సీఆర్‌ఎస్‌) ఈ నివేదికను వెల్లడించింది.

యూఎస్‌ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాలానుగుణంగా ఈ సంస్థ నివేదికలను సిద్ధం చేస్తుంది.

“హెచ్‌-4” కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారత్‌కు చెందిన వారికి మంజూరు చేశాం.

చైనాకు 5 శాతం జారీ చేయగా ఇతర దేశాలకు చెందిన వారికి 2 శాతం వీసాలిచ్చాం’ అని సీఆర్‌ఎస్‌ తన 9 పేజీల నివేదికలో వెల్లడించింది.

అయితే.2017, డిసెంబర్‌ 25 నాటికి హెచ్‌4 వీసాదారుల 1,26,853 దరఖాస్తులను అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ఆమోదించింది.

RC 16 నుంచి తప్పుకున్న రెహమాన్… క్లారిటీ ఇచ్చిన మేకర్స్?