ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు, వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.ఈ క్రమంలోనే వరద బాధితులకు అండగా ఉన్నామన్నారు.
ఈ నేపథ్యంలోనే భద్రాచలంలో 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అవసరమైన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు.
ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమన్న మంత్రి పువ్వాడ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుంది.
దీంతో ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 48 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.