గన్‌ పక్కన పెట్టి నిద్రపోయిన కేర్‌టేకర్.. లేచి చూడగానే శవమై కనిపించిన బాలుడు!

విదేశాల్లో తుపాకీలు( Guns ) మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి.ఈ ఘటనలు ఎక్కువైపోతున్నా అక్కడ మాత్రం గన్ సేల్స్ తగ్గడం లేదు.

 5 Years Old Boy Accidentally Died After Caretaker With Gun Falls Asleep Details,-TeluguStop.com

ఆత్మ రక్షణలో భాగంగా తుపాకీలను ఎవరైనా సరే కొనుగోలు చేయొచ్చనే రూల్స్ కూడా చాలా విమర్శల పాలవుతున్నాయి.క్రమంలోనే తాజాగా అమెరికా దేశం,( America ) ఇండియానా రాష్ట్రం, గ్యారీ సిటీలో ఓ విషాదం చోటు చేసుకుంది.5 ఏళ్ల బాలుడు తన కేర్‌టేకర్( Caretaker ) చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని అనంతరం దానితో కాల్చుకుని చనిపోయాడు.

వివరాల్లోకి వెళితే, కేర్‌టేకర్ బుధవారం రాత్రి నిద్రలోకి జారుకున్నాడు.

ఆ సమయంలో తుపాకీని టేబుల్‌పై ఉంచాడు.నిద్ర లేచి చూసే సరికి బాలుడు( Boy ) శవమై కనిపించాడు.32 ఏళ్ల కేర్‌టేకర్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకా అభియోగాలు నమోదు చేయలేదు.ఈ ఘటనపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతూ ప్రజల సహాయాన్ని కోరుతున్నారు.

Telugu Boy, America, Caretaker, Gary, Indiana, Nri, Tragedy, Usa Gun-Telugu NRI

మృతి చెందిన అబ్బాయి తల్లిదండ్రులు ఇటీవల బయటికి వెళ్లారు.ఆ సమయంలో ఆ బాలుడితోపాటు 17 ఏళ్ల అమ్మాయిని సురక్షితంగా చూడాలంటూ ఓ కేర్‌టేకర్‌ను పిలిచారు.అదే విషయాన్ని సదరు కేర్ టేకర్ పోలీసులకు చెప్పాడు.తాను సోఫాలో నిద్రపోయానని, ఐదేళ్ల బాలుడు తుపాకీ తీసుకున్న సంగతి తనకు తెలియదని చెప్పాడు.గన్ షాట్ ( Gun Shoot ) ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇంకేదైనా జరిగిందా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu Boy, America, Caretaker, Gary, Indiana, Nri, Tragedy, Usa Gun-Telugu NRI

ఈ ఘటనపై ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే ముందుకు రావాలని కోరుతున్నారు.ఈ ఘటనలో కేర్‌టేకర్ తప్పు ఉందో లేదో ఇంకా నిర్ధారించలేదు కాబట్టి అతని పేరును వెల్లడించలేదు.బాలుడి పేరు కూడా వెల్లడించలేదు.

ఈ దుర్ఘటన తల్లిదండ్రుల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube