చదువుకొమ్మని స్కూల్ కి పంపిస్తే ప్రేమలో పడి గర్భవతి అయిన విద్యార్థిని... చివరికి...

16 Year Old Minor Girl Pregnant By Boyfriend In Gujarat

ఈ మధ్య కాలంలో కొందరు బాలబాలికలు అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తమ తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా తాజాగా ఓ బాలిక చదువుకునేందుకు పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో పనిచేసేటువంటి వ్యక్తితో ప్రేమలో పడి గర్భవతి అయిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 16 Year Old Minor Girl Pregnant By Boyfriend In Gujarat-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని సూరత్ పట్టణ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఈ వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా అతడి భార్య కూడా ఉద్యోగం చేస్తోంది.

కాగా ఈ వ్యక్తి కూతురు స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో చదువుతోంది.అయితే ఇటీవలే బాలిక కి కడుపు నొప్పి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తల్లిదండ్రులు వైద్య చికిత్సల నిమిత్తం తీసుకెళ్లారు.

 16 Year Old Minor Girl Pregnant By Boyfriend In Gujarat-చదువుకొమ్మని స్కూల్ కి పంపిస్తే ప్రేమలో పడి గర్భవతి అయిన విద్యార్థిని… చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం డాక్టర్లు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా బాలిక తల్లిదండ్రులు ఖంగు తిన్నారు.ఇంతకీ విషయం ఏమిటంటే బాలిక ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని.

Telugu Minor Pregnant, Minorpregnant, Gujarat, Medical, Stomach Pain, Surat-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

దీంతో నెమ్మదిగా బాలికను కూర్చోబెట్టి తల్లిదండ్రులు అసలు విషయం గురించి ఆరా తీయగా గత కొద్ది రోజులుగా తన పాఠశాలలో పని చేస్తున్నటువంటి ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని దాంతో అతడికి సర్వస్వం అర్పించానని బాలిక తల్లిదండ్రులతో చెప్పింది.దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఈ విషయం గురించి సమాచారం అందించారు.రంగంలోకి దిగిన పోలీసులు అభం శుభం తెలియని బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.అంతేకాకుండా మైనర్ బాలికని గర్భవతిని చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.

#Medical #Pregnant #Surat #Gujarat #Stomach

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube