పబ్జీకి మరో బాలుడి బలి..!

ఆన్ లైన్ గేమ్ తో యువత చెడిపోతుంది.పబ్జీ లాంటి గేమ్స్ కు బానిసైన యువకులు ప్రాణాలు కోల్పోడానికి కూడా వెనుకాడటంతో లేదు.

 14year Old Boy Suicide As Mother Scolds, Online Games,telangana, Secendrabad, Bo-TeluguStop.com

గేమ్ ఎందుకు ఆడుతున్నావని చెప్పినా కష్టంగా మారుతోంది.ఇటీవల కాలంలో ఓ బాలుడు కూడా ఆట మత్తులో పడి తిండి తినక, నీళ్లు తాగక ప్రాణాలు కోల్పోయాడు.

తాజాగా, పబ్జీతో మరో బాలుడు బలయ్యాడు.ఆన్ లైన్ లో గేమ్ ఆడోద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పబ్జీ ఆడోద్దని తల్లి మందలించిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.లోతుకుంట ప్రాంతంలో నివాసముంటున్న ఓ మైనర్ బాలుడు (14) ప్రతి రోజు ఆన్ లైన్ గేమ్ లు ఆడుతూ కూర్చునే వాడు.

లేచినప్పటి నుంచి పడుకునే వరకు పబ్జీ ఆడుతుంటే తల్లి ఫోన్ ను గుంజుకుంది.ఫోన్ లో గేమ్ ఆడొద్దంటూ మందలించింది.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లో ఉన్న బెడ్రూంలోకి వెళ్లి గడి వేసుకున్నాడు.ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తలుపు తీయమని డోర్ కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు పగులగొట్టి చూడటంతో బాలుడు ఫ్యాన్ కు ఉరేసుకుని ఉన్నాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube