ఇది వైయస్సార్ మార్క్ రాజకీయం అంటూ వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.జనవరి 21వ తారీకు అధ్యక్షురాలు అయిన తర్వాత జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ మరియు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 Ys Sharmila Key Comments Saying This Is Ysr Mark Politics Congress, Ys Sharmila,-TeluguStop.com

ఈ క్రమంలోనే సోమవారం జనవరి 29 కడప జిల్లాలో పర్యటించడం జరిగింది.ఈ పర్యటనలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు.అనంతరం సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.“ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి( Eduguri Sandinti Rajasekhara Reddy )…ఈ కడప బిడ్డ పులివెందుల పులి.తెల్లని పంచే కట్టు…మొహం నిండా చిరునవ్వు.ఇవ్వాళ్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర.

సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించిన నాయకుడు.ఇది YSR మార్క్…రాజకీయం.ఆయన పథకాలే ఒక మార్క్.YSR ఆశయాలను కొనసాగించలేనీ ప్రస్తుత ప్రభుత్వం ఆయన వారసులు ఎలా అవుతారు.? జగన్( jagan ) అన్నకి నేను వ్యతిరేకి కాదు.కానీ జగనన్న అప్పటి మనిషి కాదు.

రోజుకో జోకర్ ను తెచ్చి నాపై బురద చల్లుతున్నారు.నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నా.

హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నా.ఎవరెంత నిందలు వేసినా…ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు, ప్రత్యేక హోదా వచ్చే వరకు.

ఇక్కడ నుంచి కదలను.పోలవరం వచ్చే వరకు కదలను గుర్తుపెట్టుకోండి” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube