రివ్యూ : 'ఏడు చేపల కథ'ను ఎగబడి చూడ్డానికి కారణం ఏంటో తెలుసా?

కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండి కొన్ని హర్రర్‌ సీన్స్‌ ఉంటే ఆ సినిమాలు ఈమద్య కాలంలో బాగా హిట్‌ అవుతున్నాయి.ప్రేమ కథా చిత్రమ్‌ నుండి ఆ ట్రెండ్‌ నడుస్తోంది.

 Yedu Chepala Katha Movie Review And Rating-TeluguStop.com

అందుకే దెయ్యాల సినిమాలపై సినీ జనాలు ఫోకస్‌ పెట్టారు.ఆ సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను ఆధరిస్తున్నారు.

హర్రర్‌ కామెడీతో పాటు కాస్త అడల్ట్‌ కంటెంట్‌ను జత చేస్తే ఆ సినిమాకు జనాలు విపరీతంగా ఎగబడతారని భావించిన ఈ చిత్ర మేకర్స్‌ అదే పని చేశారు.వారు అనుకున్నట్లుగానే జరిగింది.

మొదటి నుండి సినిమాపై యూత్‌ ఆడియన్స్‌ బాగా అంచనాలు పెట్టుకున్నారు.వారి అంచనాలు ఈ సినిమా ఉందా అనేది రివ్యూలో చూద్దాం.

కథ :

నెలకు ఒకసారి రక్తం ఎక్కించక పోతే చనిపోయే వింత జబ్బు తలసీమియాతో టెంప్ట్‌ రవి(అభిషేక్‌ పచ్చిపాల) బాధపడుతూ ఉంటాడు.అతడు నెలనెల రక్తం ఎక్కించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు.

అయినా కూడా అతడు ఆడవారు అంటే విపరీతమైన మోజు పడుతూ ఉంటాడు.చూసిన అందమైన ఆడవారిని కోరుకుంటాడు.

టెంప్ట్‌ రవి ఎవరినైతే కోరుకుంటాడో వారు ఆ రోజు రాత్రి అతడి పక్కలోకి వచ్చి పడుకుంటారు.ఆ ఆడవారికి కూడా రవి వద్దకు ఎలా వచ్చాం, ఎందుకు వచ్చామనే విషయం అర్థం కాదు.

ఒక దెయ్యం రవికి సాయం చేస్తూ అతడు ఎవరికి కోరుకుంటూ వారిని తీసుకు వస్తుంది.ఇంతకు ఆ దెయ్యం ఎవరు? రవి జబ్బుకు పరిష్కారం ఏంటీ ఇతరత్ర విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

టెంప్ట్‌ రవి పాత్రలో అభిషేక్‌ నటన బాగుంది.అతడు కామంతో రగిలిపోయే పాత్రలో మంచి నటన ప్రదర్శించాడు.

కొన్ని సీన్స్‌లో అతడు చాలా నాచురల్‌గా కనిపించాడు.అతడి నిజంగా స్వభావం ఇదేనా ఏంటీ అన్నట్లుగా అనిపించింది.

సినిమాలో అభిషేక్‌ కాకుండా రవినే కనిపించాడు అంటే అతడు ఎలా జీవించాడో చెప్పనక్కర్లేదు.ఇక భానుశ్రీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.

ఆమె గ్లామర్‌తో సినిమాకు ఆకర్షణగా నిలిచింది.మరో హీరోయిన్‌ మేఘనా చౌదరి తన అంద చందాలతో అలరించింది.

రవితో రొమాంటిక్‌ సీన్స్‌లో ఆమె రెచ్చి పోయింది.మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

-Telugu Movie Reviews

టెక్నికల్‌ :

కవి శంకర్‌ అందించిన సంగీతం యావరేజ్‌గా ఉంది.బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఒకటి రెండు సీన్స్‌లో మినహా మిగిలిన చోట చాలా సాదా సీదాగా రొటీన్‌గా ఉంది.ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.రొమాంటిక్‌ సీన్స్‌ మినహా మరేటిపై ఫోకస్‌ పెట్టినట్లుగా అనిపించలేదు.యూత్‌ ఆడియన్స్‌ ఎంతో ఆశ పెట్టుకుని వెళ్లే రొమాంటిక్‌ సీన్స్‌ కూడా నిరుత్సాహ పర్చుతాయి.దర్శకుడు కథను ఇంకాస్త బలంగా తయారు చేసుకుని ఉండాల్సింది.

ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయి.సినిమాటోగ్రఫీ మరీ షార్ట్‌ ఫిల్మ్‌ వర్క్‌ ఉన్నట్లుగా ఉంది.

ఇక పలు సీన్స్‌ లాగ్‌ అయ్యాయి.ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.నిర్మాణాత్మక విలువలు యావరేజ్‌గా ఉన్నాయి.

విశ్లేషణ :

ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ కాన్సెప్ట్‌కు అతడు రొమాన్స్‌ను ఎక్కువగా జత చేశాడు.కాని కామెడీ మరియు హర్రర్‌ను జోడిస్తే సినిమా ఫలితం మరో విధంగా ఉండేది అనిపిస్తుంది.యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసుకుని దర్శకుడు చేసిన ప్రయత్నం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా జరిగింది.ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు ప్రయత్నించాడు.

కాని అనుకున్నట్లుగా చూపించడంలో విఫలం అయ్యాడు.కథను ఇంకాస్త ఆసక్తికరంగా తీసుకుని ఆసక్తికర స్క్రీన్‌ప్లేతో నడిపించి ఉండాల్సింది.

టెంప్ట్‌ రవి తన నటనతో మెప్పించాడు.సినిమా కుర్రాళ్లకు పర్వాలేదు అనిపిస్తే పెద్ద వాళ్లకు మరియు ఫ్యామిలీస్‌కు మాత్రం వామ్మో అనిపించేలా ఉంది.

ప్లస్‌ పాయింట్స్‌ :

రొమాంటిక్‌ సీన్స్‌
కొన్ని కామెడీ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

కథ, స్క్రీన్‌ప్లే
దర్శకత్వం
శృతిమించిన రొమాన్స్‌
ఎడిటింగ్‌

బోటమ్‌ లైన్‌ :

శృతి మించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

రేటింగ్‌ : 2.25/5.0

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube