టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన వయసు పెరుగుతున్న కొద్దీ తన లుక్ ను మరింత పెంచుకుంటున్నాడు.మహేష్ బాబు తో పాటు తన కుటుంబం కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులను షేర్ చేస్తూ బిజీగా ఉంటారు.
ఇటీవలే ఆయన వర్క్ అవుట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు.
దాదాపు 25కి పైగా సినిమాల్లో నటించారు.కాగా మొదటి సినిమా రాజకుమారుడు తో మంచి విజయాన్ని సాధించుకున్నాడు.ఆ సినిమాలో ఉన్న అందం.ఇప్పటి వరకు అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు మహేష్ బాబు.ఇదిలా ఉంటే మహేష్ బాబుకు సంబంధించిన వీడియోలను తన భార్య నమ్రత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.ఇప్పటికీ అదే అందం తో కనిపిస్తున్న మహేష్ బాబు లాక్‌డౌన్ సమయంలో మంచి మంచి గెటప్ తో కనిపించాడు.
మహేష్ బాబు ప్రతి రోజు వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని కాపాడుకుంటాడు.ఇదిలా ఉంటే ఇటీవలే తను జిమ్ లో బాక్స్ జంప్స్ చేస్తున్న వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు.అంతేకాకుండా ” మీ ఆటను మరింత పెంచండి.సరిహద్దులు చెరిపేయండి.ఎక్కడ ఆగకండి” అంటూ మెసేజ్ ను అభిమానులకు షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేవలం 15 నిమిషాల్లో 65 వేలకు పైగా లైకులు, విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా.
మహేష్ తర్వాత సినిమాకు దీపిక పదుకొనే హీరోయిన్ గా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.