ఏపీ సీఎం జగన్ కు వైసీపీ పంచాయితీ చేరింది.కొత్తగా మంత్రి పదవి చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను సీఎం తన వద్దకు పిలిపించుకున్నారు.
సీఎం జగన్‌తో అనిల్ యాదవ్ తొలుత భేటీ కాగా, తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లారు.వైసీపీలో వివాదానికి కారణాలు తెలుసుకోవాలంటే.
ఇటీవల జరిగిన పరిణామాలు తెలిస్తే సరిపోదు.గత మూడేళ్లుగా వైసీపీ పాలన చుట్టూ తిరిగితే అసలు అర్థమే ఉండదు.
దీని వెనక పెద్ద చరిత్రే ఉంది.
రాజకీయాల్లో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య వివాదం పైకి కనిపిస్తోంది.
కానీ ఈ వివాదం బయటకు అనిల్, కాకాణి మధ్య కనిపిస్తున్నా.అంతర్గతంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఫ్యామిలీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పాత్ర ఉందని తెలుస్తోంది.
నెల్లూరు సిటీలో పూర్తి స్థాయి పట్టుకోసం అనిల్ యాదవ్ చేసిన ప్రయత్నాలు.పెద్దారెడ్లను ఏకం చేసిందనే వాదనలు స్థానికంగా వినిపిస్తున్నాయి.నెల్లూరు జిల్లా రాజకీయాలంటే రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది.
నెల్లూరు సిటీ నియోజకవర్గం రెడ్లకు పెట్టని కోటగా గుర్తింపు ఉంది.1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.ఏకంగా 10 సార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
అందులోనూ నెల్లూరు సిటీని ఆనం కుటుంబం తమ అడ్డాగా భావిస్తుంది.ఈ నియోజకవర్గంలో నుంచి ‘ఆనం’ కుటుంబ సభ్యులు ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా జెండా ఎగురవేశారు.
ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బడా వైసీపీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.అందరి మధ్య ఏదో ఒక రకంగా బంధుత్వం ఉంది.

జిల్లా కేంద్రమైన నెల్లూరు సిటీ నుంచే వీళ్లంతా తమ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తుంటారు.నెల్లూరు అంతటా వీళ్లకు అనుచరగణం కూడా మెండుగా ఉంది.ఆయా ఫ్యామిలీల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా, రాజకీయ కార్యకలాపాలు సాగినా.నెల్లూరు సిటీలో ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.కానీ, నెల్లూరు సిటీలో పట్టు కోసం అనిల్ యాదవ్ చేసిన పనులు ఈ పెద్దారెడ్లను ఏకంగా చేసిందనే వాదనలు స్థానికంగా వినిస్తున్నాయి.ముఖ్యంగా, అనిల్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి పట్టు కోసం నెల్లూరు సిటీలో ఏ నాయకుడూ ఫ్లెక్సీలు పెట్టడానికి వీల్లేదని ఓ రూల్ పాస్ చేశారు.
ఎవరైనా సరే, ఫ్లెక్సీలు పెడితే అనిల్ యాదవ్ దగ్గరుండి మరీ తీసేయించేవారు.తొలి నుంచి నెల్లూరును తమ అడ్డాగా భావించే ఆనం ఫ్యామిలీ, వారి అనుచరగణం.
తమ ఫ్లెక్సీలను ఇలా తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు.నియోజకవర్గంలో పట్టు కోసం అనిల్ యాదవ్ చేస్తున్న పనులు వారికి ఆగ్రహం కలిగించాయి.

అదే సమయంలో నెల్లూరు సిటీలో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సైతం అనిల్ యాదవ్ నుంచి ఇలాంటి పరిణామమే ఎదురైంది.కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు.దీంతో నెల్లూరు సిటీలో ఆయనకు కూడా అనుచరగణం ఉంది.వారి కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా అనిల్ యాదవ్ దగ్గరుండి మరీ తొలగించారు.జిల్లా మొత్తం మీద పట్టున్న వీరికి.నెల్లూరు సిటీలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని తెలుస్తోంది.
ఎంతో చిన్న వాడైన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి విషయాలు ఫిర్యాదులు చేసేందుకు ఆనం, వేమిరెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయా కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు, జిల్లాపై పట్టు, సీఎం దగ్గర చొరవ ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ విషయాలను అధిష్టానం ముందు పెట్టినట్లు సమాచారం.
కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎంతగా సహకరించారో అంతకు డబుల్ తాను కూడా ఇస్తానని అనిల్ యాదవ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.అందులోనూ కాకాణి మంత్రిగా జిల్లాలో అడుగుపెట్టిన రోజున ఆ స్టేజీపై ఆనం, మేకపాటి, వేమిరెడ్డి, కోటంరెడ్డి ఫ్యామిలీలకు చెందిన అందరూ ఆశీనులయ్యారు.
ఒక్క అనిల్ యాదవ్ తప్ప దీంతో పైకి, కాకాణి పేరు చెప్పి వార్నింగ్ ఇచ్చినా.లోగుట్టు మాత్రం చాలానే ఉందని తెలుస్తోంది.