ఒకప్పుడు రెస్టారెంట్ లో పని.. ప్రస్తుతం లక్షల కోట్ల కంపెనీకి సీఈవో.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఒక సాధారణ యువతి లక్షల కోట్ల కంపెనీకి సీఈవో కావడం సులువు కాదనే సంగతి తెలిసిందే.కసి, పట్టుదలతో సక్సెస్ సాధించిన యామిని రంగన్( Yamini rangan ) భారతి సంతతికి చెందిన యువతి కాగా ఆమె సక్సెస్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఒకప్పుడు రెస్టారెంట్ లో సర్వర్ గా పని చేసిన యామిని ప్రస్తుతం 2.11 లక్షల కోట్ల కంపెనీకి సీఈవోగా పని చేస్తున్నారు.ఈ ఏడాది టాప్ 100 టెక్ మహిళలలో ఆమె కూడా ఒకరిగా ఉన్నారు.

 Yamini Rangan Inspirational Success Story Details Here Goes Viral In Social Med-TeluguStop.com

మన దేశంలోని చిన్న కుగ్రామం నుంచి వచ్చిన యామిని ఒకప్పుడు రెస్టారెంట్ లో పని చేశారు.తర్వాత కాలంలో కెరీర్ పరంగా ఎదిగిన యామిని హబ్ స్పాట్( HubSpot CEO ) అనే కంపెనీలో చేరి రెండు సంవత్సరాల వ్యవధిలోనే సీఈవో పదవిని చేపట్టారు.21 సంవత్సరాల వయస్సులో కొంతమొత్తం డబ్బుతో యామిని అమెరికా( America )కు పయనం కాగా అక్కడ ఇంటి అద్దె చెల్లించిన తర్వాత ఆమె దగ్గర కేవలం 150 డాలర్లు మాత్రమే ఉన్నాయి.

ఉద్యోగం సాధిస్తే మాత్రమే తన సమస్య పరిష్కారం అవుతుందని యామిని వెల్లడించారు.ఫుట్ బాల్ స్టేడియం రెస్టారెంట్ లో ఫుడ్, డ్రింక్స్ అందించడం తన తొలి జాబ్ అని యామిని కామెంట్లు చేశారు.తానెప్పుడూ ఇండిపెండెంట్ గా ఉండాలని ఫీలవుతున్నానని ఆమె వెల్లడించారు.ఈ రీజన్ వల్లే తాను పేరెంట్స్ ను డబ్బులు అడగలేదని యామిని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

కోయంబత్తూరులో బీటెక్ పూర్తి చేసిన యామిని బెర్కిలీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.తర్వాత రోజుల్లో ఐటీ దిగ్గజ కంపెనీలలో పని చేసిన యామిని 2019 సంవత్సరంలో యామిని శాన్ ఫ్రాన్సిస్కో( San Francisco )లో అత్యంత ప్రతిభావంతమైన మహిళగా ప్రశంసలు అందుకున్నారు.

యామిని సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.యామిని రంగన్ టాలెంట్ ఎంతోమందిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube