వామ్మో, ఈ డేగ ఎంత పెద్దగా ఉందో.. చూస్తే ఆశ్చర్యపోతారు..

సాధారణంగా ఒక బ్లాంకెట్ నేలపై పరుస్తే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పులో బాల్డ్ ఈగల్స్‌( Bald eagle ) రెక్కల పొడవు ఉంటుంది.ఈ డేగలు చాలా పెద్దగా ఉంటాయి.

 Wow How Big This Eagle Is.. You Will Be Surprised , Viral Video, Latest News, Ba-TeluguStop.com

అమెరికాలో కనిపించే ఈ డేగలు ఆకాశంలో ఏకంగా పదివేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయి.వీటి రేజర్ షార్ప్ పంజా గోళ్లు ఎరను చీల్చి చెండాడుతాయి.

వీటి కంటి చూపు కూడా చాలా షార్ప్ గా ఉంటుంది.వీటిని బాడీ నల్ల కలర్ లో ఉంటే వీటి తల, తోక ఈకలు మాత్రం వైట్ కలర్ లో ఉంటాయి.

అందువల్ల ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ఇవి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరగగలవు.అది చాలా ఎత్తు చెప్పుకోవచ్చు.కానీ ఇవి చాలా తక్కువ బరువు ఉంటాయి.7 కిలోల కంటే ఇవి ఎక్కువ బరువు పెరగవు అంతా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టే ఆకాశంలో ఈజీగా దూసుకెళ్లగలవు.వీటి ఆకారం ఎంత పెద్దగా కనిపిస్తుందో చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే అందులో మనకు ఒక పెద్ద డేగను ఒక వ్యక్తి పిలుస్తుండటం కనిపిస్తుంది.ఆ వ్యక్తి చేతిలో ఉడికించిన ఒక కోడిగుడ్డు ఉంది.

దానిని చూపించగానే తినేందుకు డేగ ఎగురుకుంటూ వచ్చింది.

సమీపాన వాలిన ఆ పక్షికి సదరు వ్యక్తి బాయిల్డ్ ఎగ్‌ను తుంచి సగం వేశాడు.తర్వాత మిగతా సగం వేశాడు.గుడ్డును డేగ చాలా ఇష్టంగా తినడం మనం చూడవచ్చు.

ఆ సమయంలో డేగను వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు.చూసేందుకు డేగ పెద్దగా భయంకరంగా కనిపించింది.

వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

రాబందులు, గద్దలు కూడా చాలానే పెద్దగానే ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube