2003 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలపడింది ఇండియా. ఐతే ఈ మ్యాచ్ లో భారత్( India ) విజయం సాధించలేక పోయింది.సరిగ్గా 20 ఏళ్ళ తరువాత అదే ఆస్ట్రేలియా తో( Australia ) మల్లి ఫైనల్ లో తలపడనుంది భారత్.20 ఏళ్ళ నాటి లెక్కను సరి చేసేందుకు సిద్ధంగా ఉంది టీం ఇండియా.ఈ ప్రపంచ కప్ టోర్నీ లో( World Cup ) ఇప్పటివరకు టీం ఇండియాకు ఒక మ్యాచ్ లో కూడా ఓటమి ఎదురవ్వలేదు.అందుకే విజయం మీద విపరీతంగా ఆశలు పెరిగిపోయాయి మన క్రికెట్ అభిమానులకు.
ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ చూసేందుకు అనేక మంది సెలెబ్రిటీలు క్యూ కడుతున్నారు.
దేశమంతటా బెట్టింగులు జోరందుకున్నాయి.టిక్కెట్లు బ్లాక్ లో కూడా అమ్ముతున్నారని సమాచారం.
ఏకంగా దేశ ప్రధానమంత్రి ఈ మ్యాచ్ చూసేందుకు విచేస్తున్నారంటే, ఈ మ్యాచ్ వెనుక దేశమంతటా ఎంతటి ఆసక్తి ఉందొ తెలిసిపోతుంది.దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ ప్రభావం, ఇతర టీవీ ప్రసారాల మీద పడుతుందని అంటున్నారు విశ్లేషకులు.
అన్నింటి కంటే ముఖ్యంగా బిగ్ బాస్ షో రేటింగ్( Bigg Boss Rating ) దెబ్బతినేలా కనిపిస్తుంది.
ఇప్పటికే పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేకపోతున్న బిగ్ బాస్ షో పై, ప్రపంచ కప్ ప్రభావం పడితే, రేటింగ్ నేలమట్టం అవుతుందని భయపడుతున్నారు మేకర్స్.ఈ సీసన్ లో బిగ్ బాస్ ఒక్క వారం కూడా మా టీవీ టాప్ 30 ప్రోగ్రామ్స్ లో చోటు దక్కించుకోలేకపోయింది.వీక్ డేస్ లో బాగా డల్ గా ఉండే వ్యూవర్ షిప్, నాగార్జున( Nagarjuna ) కనిపించే వీకెండ్ ఎపిసోడ్స్ లో మాత్రం కాస్త జోరు అందుకుంటోంది.
మరి ఇప్పుడు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్( World Cup Final Match ) ఆదివారం జరగబోతోంది.అంటే కాస్తో కూస్తో రేటింగ్ రాబడుతున్న రోజును కూడా ఈ మ్యాచ్ దెబ్బకొట్టే ప్రమాదం ఉంది.మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది.రాత్రి 10 గంటల వరకు జరిగే అవకాశం ఉంది.ఒకవేళ అందరు ఆశించినట్టు ఇండియా విజయం సాధిస్తే, సెలెబ్రేషన్స్, కప్ అందుకోవడం వంటి కార్యక్రమాలు మరో అరగంట జరుగుతాయి. బిగ్ బాస్ 9 గంటలకు ప్రారంభమవుతుంది.
కనుక ఖచ్చితంగా ఈ వారం బిగ్ బాస్ రేటింగ్ పతనం అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.