హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది.బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ.6.5 కోట్లు పట్టుబడ్డాయి.
ఆరు కార్లలో డబ్బును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారని తెలుస్తోంది.అయితే ఈ మొత్తం నగదు ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడికి చెందినదని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
నగదును సీజ్ చేసిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.