వైరల్: వధూవరుల ఫోటో తీసింది కానీ కలిసిరాలేదు పాపం... ట్విస్ట్ ఇదే!

సోషల్ మీడియాలో ఎన్ని రకాల వీడియోలు వైరల్ అయినా, పెళ్లికి సంబంధించిన వీడియోల లెక్కే వేరు.ఎందుకంటే ఎక్కువశాతం వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు మాత్రమే బాగా మనోళ్ళకి ఎక్కుతాయి.

 Woman Falls Into Drain While Taking Pics In Wedding Video Viral, Bride, Groom, V-TeluguStop.com

వివాహ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న చిన్న సంఘటనలు నెటిజన్లకు కితకితలు పెడుతూ ఉంటాయి.ఇకపోతే పెళ్లిలో జరిగే ఇన్సిడెంట్స్ కొన్ని నవ్వు తెప్పిస్తే.

మరికొన్ని ఆశ్చర్యాన్ని, మరికొన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఫన్ జనరేట్ చేసిందని చెప్పుకోవాలి.

సాధారణంగా ఈ పెళ్లి వేడుక చూసుకున్నా, పెళ్లి తంతుకి సంబంధించిన విజువల్స్ తీసుకోవడానికి ఎవరో ఒకరు కెమెరా మెన్ లేదా వుమెన్ ఖచ్చితంగా వుంటారు.అయినా ఆ పెళ్ళికి వెళ్లిన కొంతమంది తమ దగ్గర వున్న ఫోన్లు పట్టుకొని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వుంటారు.ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది.వైరల్ అవుతున్న వీడియోని పరిశీలిస్తే… ఓ పెళ్లి వేడుకకి హాజరైన ఓ మహిళా వధూవరుల ఫోటోలు తీయాలనుకుంది.ఈ క్రమంలో పక్కనే కాలువ ఉందన్న సంగతి కూడా మర్చిపోయింది.ఇంకేముంది, కట్ చేస్తే ఫోటోలు తీసే క్రమంలో వెనక్కి జరగగా అమాంతం ఆ కాలువలో పడిపోతుంది.

అయితే అదృష్టవశాత్తూ… పక్కనే వున్న ఒక మనిషి వేంటనే స్పందించి ఆమెని ఆ కాలువలోనుండి బయటకు తీసే ప్రయత్నం చేయగా… పక్కన వున్నవారు కూడా అతనికి సహకరిస్తారు.ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.ఇంటర్నెట్‌లో మాత్రం తెగ వైరల్ అవుతోంది.పెళ్లిలో ఫోటోలు తీయడమే కాదు.చుట్టుప్రక్కల ఏముందో ఒక్కసారి చూసుకోవాలని నెటిజన్లు ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు.కాగా కొంతమంది ఆమెపట్ల సానుభూతి ప్రకటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube