ప్రస్తుత రోజులలో ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో, ఎటు వైపు నుండి వస్తుందో కూడా ఊహించడం కష్టం.రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న, ఏదైనా బహిరంగ ప్రదేశాలలో మహిళలు ఆగి ఉన్నా సరే.
చైన్ స్నాచర్లు( Chain Snatchers ) మాత్రం తెగ రెచ్చిపోతున్నారు.స్నాచింగ్ చేసే క్రమంలో మహిళలను రోడ్డుపై కొంత దూరం వరకు లాక్కొని వెళ్లడం అనంతరం మెడలో నుంచి చైన్ లాక్కొని అక్కడి నుంచి పరుగులు పెట్టే సందర్భాలు కూడా చాలానే చూసాం.
అచ్చం అలాంటి సంఘటన ఒకటి తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది.
స్థానికులు అందజేసిన వివరాల ప్రకారం.మంజుల, ద్వారకానాథ్ దంపతులు మధురై (M adurai )లోని పంథాడిలో నివాసం ఉంటున్నారు.దీపావళి పండుగ సందర్భంగా వాళ్లు షాపింగ్ కోసం వెళ్లారు.
షాపింగ్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చే క్రమంలో అప్పటికే మంజుల మెడలో బంగారాన్ని చూసిన ఇద్దరు దుండగులు ఆమెను ఫాలో అయ్యి ఇంటి ముందు ద్వారకానాథ్ బైక్ ఆపగా మంజుల దిగే ప్రయత్నం చేయగా ఆ సమయంలో వెనకాల ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు దొంగలు ఒకరు మంజుల మేడలోని చైన్ ను లాగేశారు.దీంతో ద్వారకానాథ్ కింద పడిపోవడం.
ఆమెతోపాటు మంజుల కూడా కింద పడిపోవడం జరిగింది.కానీ, చైన్ మాత్రం దొంగ చేతిలోకి రాలేదు.
అయినా కానీ.దొంగలు ఆమెను వదల్లేదు.
ద్విచక్ర వాహనంపై ఉన్న దొంగలు అలానే మంజులను కొంత దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకొని వెళ్లగా.దీంతో గొలుసు తెగిపోయి రెండు భాగాలుగా అయిపోయింది.ఇందులో ఒక భాగం దుండగులు ఎత్తుకొని పోగా మరొక భాగం మంజుల దగ్గరే ఉండిపోయింది.ప్రస్తుతం ఈ చైన్ స్నాచింగ్ కి సంబంధించిన వీడియో సిసిటీవీలో రికార్డయి అది కాస్త వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు అక్కడి పోలీస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.