ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి తమ కాపురాలు చేజేతులారా నాశనం చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా ఓ వివాహిత పెళ్లయిన కొంతకాలానికి తన భర్తతో మనస్పర్థలు రావడంతో తన పుట్టింటిలో గడుపుతూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ఆ విషయం కాస్త తన అన్నయ్య కి తెలియడంతో ఏకంగా అతడిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి బేతపూడి పరిసర ప్రాంతంలో పోతురాజు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానిక ప్రాంతంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.
ఈ మధ్యకాలంలో పోతురాజు సోదరి ఆదిలక్ష్మికి తన భర్తతో విభేదాలు రావడంతో పుట్టింటికి వచ్చింది.ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తితో ఆదిలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది.దీంతో ఈ విషయం తెలుసుకున్న పోతురాజు ఆమెను పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె అతడి మాటల్ని పెడచెవిన పెట్టింది.
దీంతో తో తాజాగా ఈ విషయంపై పోతురాజు మరియు ఆదిలక్ష్మి మధ్య గొడవ జరిగింది.
అయితే ఈ గొడవలో ఆదిలక్ష్మి మరియు ఆమె తండ్రి పోతురాజు పై దారుణంగా రోకలి బండతో దాడి చేయడంతో పోతురాజు అక్కడికక్కడే మృతి చెందాడు.దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.
అలాగే నిందితులు ఆదిలక్ష్మి మరియు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.