తన రెండు విడతల వారాహి యాత్రతో( Varahi Yatra ) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన మాటల తాలూకు మంటలు చల్లారడానికా అన్నట్టు కొంత విరామం ఇచ్చారు.అయితే తన ఉత్తరాంధ్ర యాత్ర తో మరోసారి ఏపీ పాలిటిక్స్ లో హై ఎండ్ హీట్ ను పెంచేయడానికి జనసేనాని సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ను వేదిస్తున్న ప్రధాన సమస్యలను అధ్యయనం చేస్తూన్న పవన్ ఈ దిశగా మాటల తూటాలను సిద్దం చేసుకుంటునట్టు తెలుస్తుంది.ముఖ్యంగా విశాఖలో( Vishakapatnam ) భూకబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని అధికార పార్టీ అండదండలతో కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు విపరీతంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా దక్కించుకుంటున్నారు అంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దానిపై భారీ కసరత్తు చేసిన జనసేన( Janasena ) విధాన కమిటీ పూర్తిస్థాయి రిపోర్టును జనసేనానికి ఇచ్చిందని తన వారాహి యాత్రలో ఈ విషయాలు హైలెట్ కాబోతున్నాయి అంటూ కూడా జనసేన వర్గాల నుంచి వినిపిస్తుంది.అంతేకాకుండా విశాఖ ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు విపరీతంగా పెరిగి పోవడం ,దేశవ్యాప్తంగా గంజాయి సప్లై మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరకడం వంటి విషయాలను పవన్ తన వారాహి యాత్రలో హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా సాక్షాత్తు ఒక ఎంపీకే రక్షణ లేని విధంగా వైజాగ్ లో శాంతిభద్రతలను దిగజార్చిన వైనాన్ని పవన్ ప్రశ్నించబోతున్నారని తెలుస్తుంది.
ఉభయగోదావరి జిల్లాల వారాహి యాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని తన ఉత్తరాంధ్ర పర్యటనతో అసలైన పొలిటికల్ సినిమాను పవన్ కళ్యాణ్ చూపించబోతున్నారంటూ జనసేన వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .మరి తన యాత్రతో మరెన్ని కాంట్రవర్సీలకు పవన్ కేంద్రం గా మారనున్నారో చూడాలి.ప్రభుత్వం కూడా వారాహి యాత్రపై ఒక కన్ను వేసి ఉంచిందని ప్రభుత్వంపై అనుచిత విమర్శలు చేస్తే మాత్రం లీగల్ గా పవన్ ఇరికించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది.
అంతిమ ఫలితం ఎలాగున్నా తన యాత్రలతో రాష్ట్ర రాజకీయాన్ని పరుగులు పెట్టిస్తున్న ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని చెప్పాలి.