“సప్త సాగరాలు దాటి సైడ్ బి”( Sapta Sagaralu Dhaati Side B ) సినిమా ఓ కన్నడ సినిమాకి తెలుగు వర్షన్.ఇది రీసెంట్ గానే రిలీజ్ అయింది.
కన్నడ చిత్రసీమలోనే కాకుండా మన తెలుగులో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.ఇందులో 777 చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి( Rakshit Shetty ) హీరోగా, రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) హీరోయిన్‌గా నటించారు.
ఈ మూవీ “సప్త సాగరాలు దాటి సైడ్ ఎ”కి సీక్వెల్, ఇది కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.
ప్రముఖ కన్నడ నటి, గాయని అయిన చైత్ర జె.ఆచార్( Chaithra J Achar ) సీక్వెల్ సినిమాలో ఒక సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కనిపించింది.సురభి అనే ఒక సెక్స్ వర్కర్ గా ఆమె కనిపించింది.
ఆ పాత్ర బాగా హైలెట్ అయింది.పొట్టకూటి కోసం పోరాడే అమ్మాయిగా, హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తిగా ఆమె కనబరిచిన నటన చాలామందిని ఆకట్టుకుంది.
అందుకే ఇప్పుడు ఆమె ఎవరా అని టాలీవుడ్ ఆడియన్స్ వెతకడం మొదలుపెట్టారు.ఆమె యాక్టింగ్ గురించే చర్చించుకుంటున్నారు.
మరి ఆమె ఎవరు? మనమూ తెలుసుకుందాం.
చైత్ర జె.ఆచార్ కన్నడలో “మహీరా”, “మిల్కీ”, “ఆ దృశ్య”, “తాబి (Toby)” వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.ఆమె ప్రముఖ గాయని సైమాతో కలిసి పనిచేసిన “గరుడ గమన వృషభ వాహన”తో సహా అనేక సినిమాలకు పాటలు కూడా పాడింది.
ఆ చిత్రంలోని ఆమె పాట “సోజుగాడా సోజు మల్లిగే” ఆమెకు 2019లో కన్నడ ఉత్తమ నేపథ్య గాయని అవార్డుని గెలుచుకుంది.
చైత్ర స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు.( Bangalore ) ఆమె విద్య, కళలకు విలువనిచ్చే సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చింది.చిన్నప్పటి నుంచి కర్నాటక సంగీతం( Karnataka Music ) నేర్చిన ఆమెకు సంగీతంపై అమితమైన ఆసక్తి.
సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె చిన్న వెబ్ సిరీస్‌లతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.రక్షిత్ శెట్టితో కలిసి స్ట్రాబెర్రీ, బ్లింక్, “హ్యాపీ బర్త్ డే టు మీ” యారెగు హల్బేడి వంటి కన్నడ సినిమాల్లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.
త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సప్త సాగరాలు దాటి( Sapta Sagaralu Dhaati ) సినిమాలో నటించిన చైత్ర తెలుగు చిత్రసీమలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.భవిష్యత్తులో తెలుగు చిత్రసీమలో మరిన్ని అవకాశాలు వస్తాయని చాలామంది అప్పుడే అంచనాలు కూడా వేస్తున్నారు.
చైత్ర ప్రతిభావంతురాలు, బహుముఖ నటి మరియు గాయని, ఆమెకు చలనచిత్ర పరిశ్రమలో ఉజ్వల భవిష్యత్తు ఉందని అంటున్నారు.