వెలుగులోకి రహస్య పత్రాలు .. ఆయనకు ఏ పాపం తెలియదు : బైడెన్‌ను వెనకేసుకొచ్చిన వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం అమెరికా రాజకీయాలను కీలక మలుపు తిప్పింది.

 White House On Discovery Of Classified Records Tied To Us President Joe Biden De-TeluguStop.com

బైడెన్‌పై విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని విపక్ష రిపబ్లికన్లతో పాటు మీడియా డిమాండ్ చేస్తోంది.వ్యవహారం ముదురుతూ వుండటంతో అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ నష్ట నివారణా చర్యలు మొదలుపెట్టింది.

ఒక రకంగా ఆయనను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది.

రహస్య సమాచారాన్ని జో బైడెన్ చాలా సీరియస్‌గా తీసుకుంటారని.

ఆయన పాత కార్యాలయంలో వెలుగుచూసిన పత్రాల్లో ఏముందన్నది అధ్యక్షుడికి తెలియదని పేర్కొంది.ఈ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కేరిన్ జిన్ పియర్ ప్రెస్ బ్రీఫింగ్‌లో చెప్పారు.

సదరు పత్రాలు పొరపాటున బైడెన్ కార్యాలయంలోకి చేరాయని ఆమె అన్నారు.పత్రాలు గుర్తించిన వెంటనే అధ్యక్షుడి లాయర్లు వెంటనే న్యాయశాఖను సంప్రదించి.

నేషనల్ ఆర్కైవ్స్‌కు తిరిగిచ్చేశారని కేరిన్ పేర్కొన్నారు.

Telugu Classified, Democrats, Joe Biden, Republicans, White, Whitepress-Telugu N

మరోవైపు రహస్య పత్రాల అంశంపై దర్యాప్తును రాబర్ట్ హర్ అనే న్యాయవాదిని నియమిస్తున్నట్లు అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్ ప్రకటించారు.అయితే డెలావర్‌లోని బైడెన్ నివాసాన్ని సందర్శించిన వ్యక్తుల వివరాలను విడుదల చేయాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు.గతంలో డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా రిసార్ట్స్‌లోనూ ఇదే తరహాలో రహస్య పత్రాలు దొరకడం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రస్తుత, మాజీ అధ్యక్షుల వ్యవహారాలను పోల్చి చూస్తూ పెద్ద చర్చ జరిగింది.అయితే బైడెన్‌కు సంబంధించిన ఈ ఇష్యూ రానున్న రోజుల్లో అమెరికా రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Telugu Classified, Democrats, Joe Biden, Republicans, White, Whitepress-Telugu N

డాక్యుమెంట్లు ఎలా వెలుగులోకి వచ్చాయంటే:

గతేడాది నవంబర్ 2న బైడెన్ పాత కార్యాలయం (2009 నుంచి 2013 వరకు ఉపాధ్యక్షుడిగా వున్న సమయం) ని మూసివేసేందుకు ఆయన లాయర్ అక్కడికి వెళ్లారు.ఈ క్రమంలో సదరు లాయర్‌కు పర్సనల్ లేబుల్ పేరుతో రహస్య పత్రాలు అని వున్న కవర్ కనిపించింది.దీంతో ఆయన వెంటనే నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారం అందించారు.ఆ తర్వాత బైడెన్ బృందం కొన్ని బాక్సులను ముందే అక్కడి నుంచి తరలించినట్లుగా తెలుస్తోంది.అప్పుడే విషయం వెలుగుచూసినప్పటికీ.ఆ తర్వాత కొద్దిరోజులకే అమెరికా మధ్యంతర ఎన్నికలు వుండటంతో ఈ వ్యవహారాన్ని తొక్కి వుంచారు.

మిడ్ టెర్మ్ ఎలక్షన్స్, రీసెంట్‌గా ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నికలు ముగిసిన తర్వాత విషయం గుప్పుమంది.ఈ వార్త అప్పుడే ప్రపంచానికి తెలిసివుంటే డెమొక్రాట్ల పరువు పోవడంతో పాటు ఎన్నికల్లో ఎంతో నష్టం కలిగేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube