మీ ఇంట్లో ఫ్యాన్ కి ఎన్ని రెక్కలున్నాయి? 3 రెక్కలా, 4 రెక్కలా.. ఏది బెటర్?

వేసవి మంట పుట్టిస్తోంది.అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి.

 Which Ceiling Fan Is Better 3 Blade Or 4 Blade Details, Fans, Latest News, Techn-TeluguStop.com

ఈ క్రమంలో అందరూ ఏసీలు కొనలేరు కదా.పోనీ ఎయిర్ కూలర్ కొందామన్నా.బాదుడే బాదుడు.ఈ నేపథ్యంలో ఫ్యాన్ కొనుక్కోవాలని అనుకొనే వారికి రకరకాల డౌట్స్ వస్తుంటాయి.ఈమధ్య కాలంలో చూసుకుంటే రకరకాల బ్రాండ్లు 3 కన్నా ఎక్కువ రెక్కలు కలిగిన ఫాన్స్ ని మార్కెట్లోకి దించుతున్నాయి.ఈ రెక్కల విషయంలో చాలామందికి ఓ డౌట్ వుంది.

అదే 3 రెక్కల ఫ్యాన్ కొనుక్కొంటే మంచిదా లేక 4 రెక్కల ఫ్యాన్ కొనుక్కుంటే మంచిదా అని.

Telugu Blades Fan, Fans, Latest, Season, Ups-Latest News - Telugu

సాధారణంగా ప్రపంచంలో చూసుకుంటే మన ఇండియాలోనే ఫ్యాన్స్ ఎక్కువగా వాడుతుంటారు.అందులోనూ 3 రెక్కల ఫ్యాన్స్ ఎక్కువగా ఇక్కడ వాడుతూ వుంటారు.ఎందుకంటే.

మార్కెట్‌లో అవే ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి.ఇక సింగిల్ రెక్క ఉన్న ఫ్యాన్‌ని ఎవరైనా చూస్తే గనుక ఠక్కున “దానికి గాలి రాదు” అని మనసులో అనుకుంటారు.

ఇక 4 రెక్కలను చూస్తే… “గాలి దంచి కొడుతుందేమో!” అని అనుకుంటారు.ఇలా ఎవరి డౌట్లు వారికి ఉంటాయి.

ఇకపోతే ఏ ఫ్యాన్ అయినా దానికి ఉన్న బ్లేడ్లు, దాని డిజైన్, దాని మోటర్, దాని నుంచి వచ్చే గాలి ప్రవాహ రేటు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి.

Telugu Blades Fan, Fans, Latest, Season, Ups-Latest News - Telugu

సాధారణంగా సింగిల్ బ్లేడ్ ఫ్యాన్లు అనేవి ప్రత్యేకించి ఒకే ప్రదేశానికి మాత్రమే గాలిని పంపిస్తాయి.అందువల్ల వీటిని పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం వాడుతూ వుంటారు.ఇక 2 బ్లేడ్ల ఫ్యాన్లను ఇళ్లలో వాడుతుంటారు.

ఇవి ఎక్కువ గాలి ఇస్తాయి కానీ చిన్న గదులకు మాత్రమే ఇవి సెట్ అవుతాయి.ఇక 3 బ్లేడ్ల ఫ్యాన్లు గురించి అందరికీ తెలిసిందే.

ఇవి గాలిని అన్ని వైపులకూ సమానంగా ఇస్తాయి.ఇక 4 బ్లేడ్ల ఫ్యాన్ల వాడకం ఇప్పుడిప్పుడే పెరిగింది.

ఇవి పెద్ద గదులకు బాగా సెట్ అవుతాయి.విశాలమైన ప్రదేశాల్లో వీటిని వాడటం మేలు.

ఇవి ఎక్కువ గాలిని ఇస్తాయి.అందుకు తగ్గట్టే.

కరెంటు వాడకం కూడా పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube